మన మహిళామణులు

కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించారు శ్రీమతి పి.చైతన్య

             చైతన్య

బందరు దగ్గర ఉన్న పెండింగ్లో పుట్టి పెరిగిన చైతన్య తెలుగు మీడియం టెన్త్ క్లాస్ 70శాతం మార్కుల తో పాసైనాక ఖాళీగా కూర్చోలేదు.బందరులో ఉన్న పట్టాభిసీతారామయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే కుట్టు మిషన్ కోర్సులో చేరారు.3నెలలు శిక్షణ పొందారు.రోజూ రానుపోనురైలుచార్జీ 10రూపాయలు ట్రస్ట్ వారు ఇచ్చేవారు.ఉదయం 10నుంచి 5దాకాటైలరింగ్ క్లాస్ లో ఉండాలి.అబ్బాయిలకు కూడా కంప్యూటర్ ఇతర కరెంట్ పనుల్లో శిక్షణ ఇ‌చ్చేది ఆసంస్థ. ఆపై చైతన్య 5నెలల మిషన్ ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారు.మధ్యాహ్న భోజనం కూడా ఆసంస్థ వారు పెట్టేవారు.నెలకి300చేతిఖర్చుకూడా ఇచ్చింది ఆసంస్థ.ప్రైవేట్ గా బి.ఎ.పాసైనారు.కుట్టుమిషన్ కొనుక్కోవడానికి 50వేలు లోన్ ఇచ్చారు.ఆ అప్పు తీర్చడం పెళ్లి కావడంతో హైదరాబాద్ లో కాపురం పెట్టారు.ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో ఇంట్లోనే కుట్టు పని తో సంసారం తో టైం సరిపోయేది కాదు.ఆమె తల్లి దండ్రులు నేతచీరలు కలంకారీ పనిలో పెడనలో ఉన్నారు.వారి దగ్గర నుంచి చీరలు తెచ్చి అమ్మినా శ్రమ తప్ప లాభం లేకపోయింది.భర్తసోదరుడు బందరు వన్ గ్రామ్ గోల్డ్ వ్యాపారి కావడంతో ఇంట్లోనే  ఉండి ఆ వ్యాపారం లో భాగం పంచుకున్నారు ఆమె.ప్రస్తుతంపిల్లల చదువు సంధ్యలు చూసుకుంటూ 2ఏళ్ళబట్టి మస్కిటో నెట్ కుట్టి ఆవచ్చిన డబ్బు తో భర్తకి చేదోడు వాదోడుగా ఉంటున్న చైతన్య స్వయంగా ఇంటిపనులు చేస్తూ దిగువ మధ్యతరగతి గృహిణి గా పొదుపుగా సంసారం ఈదుతున్నారు.పిల్లల డ్రెస్సులు వాటిపై మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు.ఓగృహిణిగా చదువు నేర్చుకున్న విద్యను సార్ధకం చేస్తూ సంతృప్తి గా ఉండటమే మహిళకి ముఖ్యం అనే ఆమె మాటల్లో ఎంతో నిజం ఉంది కదూ?

 
చేతితో జారీ దారాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు.దోమతెర లాంటి కాస్త గట్టిగా ఉండే షీట్ నుంచి ఒక కంపెనీ వారు ఇస్తారు. దానికి నాలుగువైపులా వారు ఇచ్చిన మెటీరియల్ తో అంచులు కుట్టి ఆకంపెనీకి అందజేస్తారు. అవి కిటికీలకి అమరిస్తే దోమలు రావు.ఇలా ఇంట్లో కూచుని స్వయం ఉపాధి కి మార్గం ఎంచుకున్నారు ఆమె.ఇద్దరు ఆడపిల్లలు  హైస్కూల్ చదువులు ఇంటిపని తో ఓగృహిణిగా భర్త కి చేదోడు వాదోడుగా ఉంటున్న చైతన్య హైదరాబాద్ నివాసి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పూడ్చుకోలేని తప్పు

తన పేరు -తొందరపాటు.