పూడ్చుకోలేని తప్పు

ముందు తరాలకు స్వాగత ద్వారాలు తెరుద్దాం

             చీదెళ్ళ సీతాలక్ష్మి

సత్యం సార్థక నామ ధేయుడు.
మనసులో ఒకటి పైన ఒకటి ఉండదు.తెల్లకాగితం లాంటి మనసు.
చిన్నప్పుడు పది మందిలో ఒకడు కాబట్టి తండ్రి ఒక్కడే సంపాదన.పిల్లలందరిని ఉన్నంతలో చదివించి ఉన్నతంగా పెంచారు. చిన్నప్పటి విషయాలు ఎలా వున్నాం,ఎట్లా బ్రతికాం,కన్నవారు ఇంత కష్ట పెట్టకుండా ఎంత బాగా కాపాడి పోషించారు.ఇప్పుడు ఒక్కరిద్దరికే ఆపసోపాలు పడుతున్నారు.అప్పటి దినాలే మంచివి.కలిసిమెలిసి ఉండేవాళ్ళు . తృప్తిగా జీవించారు. ఇప్పుడు పిల్లలు కూడా వద్దనుకునే దౌర్భాగ్యులు వున్నారు అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.
పిల్లలిద్దరూ అమ్మాయిలను బాగా చదివించారు.బి.టెక్ వరకు ఇండియాలోనే వున్నారు.బాగా జాగ్రత్తలు తీసుకున్నారు.అన్ని వసతులు సమకూర్చారు.వారు అడిగిన పుస్తకాలు కొనిచ్చారు.పిల్లలను ఎంతో గారబంగా పెంచారు తల్లిదండ్రులు. ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడ్డారు.
పెద్దమ్మాయికి తాను కోరుకున్నవాడిటి పెళ్లిచేశారు.సంసారం బాగానే సాగుతుంది.వాళ్ళకి ఒక అమ్మాయి పుట్టింది. చాలా తెలివిగలది ,అందమైనది.తనొక్కతే ఏదీ ఉంటే దానితో ఆడుకుంటుంది.
అంతా బాగానే వుంది కానీ వాళ్ళు చెప్పినట్టే వినాలి. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు.మీకెమి తెలియదు అంటారు.కష్టపడ్డ జీవితాలు కాబట్టి డబ్బును నీటిప్రాయంగా వృధాగా ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు.అట్లాని పిసినాసి కాడు. అవసరమొస్తే ఎంతైనా ఖర్చు పెడతాడు. పైసా పైసా కూడబెట్టి ఓ ఇల్లు కట్టుకున్నాడు.లేని వాళ్లకు, మంచిగా చదివే అమ్మాయిలకు సహాయం చేసే గుణం కూడా ఉంది.
ప్రభుత్వఉద్యోగం చేసి విశ్రాంతి తీసుకోకుండా ఏవో రచనలు చేస్తుంటాడు. ఎప్పుడు చురుకుగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం అనే మనస్తత్వం.
అక్క చెల్లెల్లు తమ్ముళ్లు అంటే ప్రేమ ఎక్కువే.కవిమిత్రులను కూడగట్టుకుని అందరితో కలుపుగోలుగా ఉంటాడు.
చిన్న అమ్మాయి పెళ్లి కూడా తెలిసిన అబ్బాయితో చేశారు.కూతురు అల్లుడు బాగానే వుంటున్నారు.అత్తమామలు మంచివాళ్ళు పెద్దమ్మాయి అత్తగారు వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు.అందరూ ఒకే ఇంటివాళ్ళ లాగా ప్రేమగా కలిసి వుంటారు.
అన్నీ బాగానే ఉన్నాయి.అందరూ బాగానే వున్నారు.పిల్లలు అమెరికాలో ఆనందంగా వున్నారు. కానీ మనసుకు ఒక వెలితి.
పెద్దమ్మాయి కనీసం ఒక్కదాన్నన్న కనింది.ఇదేమో ఇలా అని మనసులో వేదన.ఎవరితో చెప్పుకోలేము.మీరేం హాయిగా ఉన్నారని అంటారు.కానీ పరిస్థితి ఇది.చిన్నమ్మాయి మాత్రం
నాకు పిల్లలు వద్దు నేను కనను అంటుంది.ఎందుకో తెలీదు.
పిల్లలు పుడితేనే మంచిది.తరువాతి తరం కావాలి.నీ అక్కకు పిల్లలున్నా నీ పిల్లలు వేరు కదా.ఎవరి కడుపుతీపి వారిది.వేరే వారి పిల్లల మీద నీకు ఎందుకు చనువు ఉంటుంది. కాకిపిల్ల కాకికి ముద్దు.
వయసులో ఉన్నప్పుడే కనాలి.వయసు దాటితే పిల్లలు పుట్టడం కష్టం.ఇంట్లో పిల్లలు తిరుగుతుంటే ఎంత ఆనందం.ఎంత తృప్తి.మన పిల్లలు మనకు ఉండాలి.అని వాళ్ళ అమ్మ చెపుతుంది
“వద్దమ్మ మళ్ళీ ఇంకోసారి పిల్లల గురించి మాట్లాడితే నేను నీతో మాట్లాడను’ అని అమెరికానుండి చేసే వాట్సాప్ కాల్ కట్ చేస్తుంది
పిల్లలు వినరు చెపితే అర్థం కాదు.దాటిన వయసు తిరిగిరాదు. మేము ఎంత కాలం ఉంటాం .ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లమే కదా.పోనీ వేరే పిల్లలను తెచ్చి పెంచాలంటే ఎవరి గండమో ఎవరి పిండమో.
వయసు ఉంది కనే సత్తావుంది.మన కడుపు పంట మనకు.ఆ ప్రేమే వేరు.అని తలపోస్తూ నిజంగా పిల్లలు కనకుంటే ఎంత సంపాదించినా దండగే.ఎంత ఆస్తి వున్నా దండగే.
వయసు అంతా అయిపోయాక పిల్లలు కావాలంటే వస్తారా? ఏ వయసులో ఏది చేయాలో అది చేస్తే అందం .బాగా చదువుకున్నామని అనుకుంటారు,మాకే తెలివుండని అనుకుంటారు కానీ వీళ్లంతా మూర్ఖులు ఎవరుండరు.చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టు.అసలు ఏమి తెలియని వారు ,చదువు లేనివారే నయం.పిల్లల్ని కని ఆనందంగా సంసారం చేసుకుంటారు.వీళ్ళదంతా అతి తెలివి.అన్ని తెలుసనుకొని మొండిగా ప్రవర్తిస్తారు.అని మదన పడుతుంది తల్లి.
ఎంతైనా కన్నతల్లి కదా.కాస్త బాధ ఉంటుంది కానీ ఏమీ చెప్పలేక పోతుంది మూర్ఖపు బిడ్డకు.
వయసంతా అయిపోయాక అప్పుడు కావాలంటే పిల్లలు పుట్టుకొస్తారా. మాకు తెలిసిన అమ్మాయికి అంతే. వయసులో వున్నప్పుడు ఎంజాయ్ అంటూ పిల్లలను కనలేదు. కావాలన్నప్పుడు కలగలేదు.తిరగని గుడి లేదు.మొక్కని దేవుడు లేడు.తొక్కని డాక్టరు గడప లేదు.ఇప్పుడు వయసయిపోయింది.తెగ బాధ పడతారు.ఏదేమైనా తే వయసులో ఏది చేస్తే ముద్దో అదే చేయాలి.అప్పుడే జీవితానికి సార్థకం,బ్రతుకుకు అర్థం.
తర్వాత పూడ్చుకోలేము. వెనక్కి తీసుకోలేము.చదువులెక్కువయ్యి వేషధారణలో ఆలోచనలో మార్పులు చూస్తున్నాం.మారుతున్న సమాజం మారుతున్న ఆలోచనా వైఖరి. ఎంతవరకు .ఎటు పోతుంది సమాజం.అభివృద్ధి పథం వైపా,అధః పాతాళానికా.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు.పెద్ద వాళ్ల మాట చద్ది మూట అనే విషయం మరచి చాదస్తం అనుకుంటారు.
తర్వాత బాధ పడ్డా ప్రయోజనం శూన్యం.సమాజం మనం ఏంటి పరిస్థితి ఆలోచించి ముందడుగు వేయాలి.ఆలోచనలకు పదును పెట్టాలి. పెద్దలు చెపితే వినాలి. పెద్దలు ఏది చెప్పినా మీ మంచికే కానీ వారికొచ్చే ప్రయోజనం అణువంతైనా ఉండదు.ఎక్కడ ఉన్నా సుఖం కోరుకునే వాళ్ళు.కన్నవారు స్వార్థపరులు కాదు.పిల్లల కొరకే వారి బ్రతుకు పూడ్చుకోలేని తప్పు చేస్తున్నావ్ దిద్దుకోలేని తప్పు చేస్తున్నావ్. తర్వాత ఎన్ని అనుకున్నా ఎవరూ రారు.ఏమి చేయరు.ఏదో చేస్తారని ఆశ పడడం కూడా తప్పే.మన తెలివిని మనను మనమే నమ్ముకోవాలి అనుకుంది ఆ తల్లి..
ఆలోచించండి.చించండి కళ్ళు తెరవండి. భగవంతుడు అన్నీ ఇచ్చాక ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం పిల్లల్ని కనే సత్తా. ఇవన్నీ అందరికీ ఉండవు.పిల్లల కొరకు లేనివాళ్ళు పిల్లలు పుట్టాలని ఎన్నో పాట్లు గుడి గోపురాలు తిరగడం,డాక్టర్ల చుట్టూ తిరగడం ఎంతో మంది ఉన్నారు.మనలో అన్ని వసతులు ఉన్నపుడు గొడ్రాలుగా మిగిలిపోవడం సబబేనా .వయసుడుగినాక కావాలని బాధ పడ్డా ప్రయోజనం శూన్యం.ఎవ్వరు ఏమి చేయలేరు. చేతులు కాలాకఆకులు పట్టుకున్నట్టే. అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.మనం ఇంకో తరానికి పునాది అవాలి. సంసారం దినదిన ప్రవర్ధమానం కావాలి.నీకు పుట్టేవాళ్లే గొప్పోళ్ళు,మహనీయులు కావచ్చు.ఏ పుట్టలో ఏ పాముందో,ఎవరితో ఏమి జరుగునో ,దేశానికి ఒక గొప్ప వాళ్ళను ఇచ్చిన వాళ్ళను అవుతాము.అప్పుడు వాళ్ళ అమ్మానాన్న పిల్లలు వద్దు అనుకుంటే.. అబ్దుల్ కలాం,గాంధీజీ,ఇందిరాగాంధీ,సుబ్బలక్ష్మి,పి.వి.సింధు ఆఖరికీ మార్క్స్ కూడా పదిమంది పిల్లల్ని కన్నాడు చాలా కష్టాల్లో ఉండి కూడా.ఆటగాళ్లు,గాయకులు,నృత్యకారులు,రచయితలు,పరిశోధకులు,శాస్త్రవేత్తలు ఇలా ఎంత మంది ఎన్నెన్ని రంగాల్లో రాణించారో చూస్తున్నాము.కనే అవకాశం వున్నప్పుడు వదులుకోవద్దు.అవకాశాలు వెదికి రావు.మనమే అవకాశాలను వెదుక్కోవాలి. మనం ఎవరికోసం తాపత్రయ పదక్కరలేదు.మన చేతిలో పని చాతనయిన పని మనం చేయొచ్చు.పెద్ద వాళ్ళు చాదస్తులు అనుకోకుండా వారి అనుభవాన్ని గమనించాలి .తెలుసుకోవాలి.మాకే అంతా తెలుసు వాళ్ళు పెద్దవాళ్ళు,ముసలోళ్ళకు ఏమి తెలుసు అనడం అజ్ఞానం.వాళ్లకు ఏమి తెలియకనే సంసారం కొనసాగించారా? పిల్లల్ని గొప్పవాళ్లను చేశారా? వున్నా లేకున్నా తమ పిల్లలంటే వాళ్లకు ప్రేమ. తాము కడుపు మాడ్చుకుని కూడా పిల్లలకు పెట్టి తింటారు.అప్పులు చేసైనా చదివిస్తారు పెళ్లిళ్లు చేసి.పెద్దవాళ్ళను చేస్తారు.ఇంకా సరిపోదని మనుమడు,మనుమరాళ్లు కావాలని వాళ్ళ పిల్లలకు కూడా సేవ చేస్తారు.ఇదంతా ప్రేమతోనే సుమా.ఇద్దరైనా ఉంటే ముద్దు.ఒకరికొకరు తోడుగా వుంటారు.మన ముద్ర ఉండాలి మనం పొయ్యాక కూడా.మన సిగ్నేచర్ అంటే తరువాతి తరం పిల్లలే.పశుపక్ష్యాదులు కూడా వయసొచ్చాక సుఖాన్ని అనుభవిస్తాయి.శిశిర ఋతువులో ఆకులు రాలిన చెట్లయినా తిరిగి పురుడు పోసుకుని చిగురించి పచ్చగా ఉండి పూలు కాయలు పండ్లు ఇస్తాయి.సమాజానికి ఉపయోగపడతాయి.నాకెందుకు అనుకుంటే ప్రపంచం ముందుకు సాగేనా? చదువు ,తెలివి,సంస్కారం ఉంది అనుకుంటారు కానీ మీరెంత తెలివుతక్కువ వాళ్ళో,ఆలోచనా తక్కువ వాళ్ళో చూస్తుంటే జాలి వేస్తుంది.అమ్మ అని పిలిపిచుకోవడం కూడా వరమే.అందరికి అన్ని అవకాశాలు ఉండవు.అవకాశం ఉన్నవాళ్లు వదులుకోవద్దు.అదీ ధర్మబద్ధంగానే సుమా.ఇప్పుడు పిచ్చి వేషాలు ఎక్కువయ్యాయి.సహజీవనాలు,పెళ్లికాకుండానే పిల్లల్ని కనడం,వాళ్ళను అనాథలుగా చేయడం,వొళ్ళు కొవ్వెక్కి తిరగడం గమనిస్తున్నాం.ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాలి.వెర్రి తలలు వేస్తున్న సంస్కారం. తెలివి తమ సొత్తయిన మానవులు ఏమి ఆలోచిస్తారో….తరువాతి తరానికి తెర తీస్తారో. .. గొడ్రాలుగా వద్దు, పిల్లలుంటేనే ముద్దు.
మంచి ఆలోచనలు,మంచి స్నేహితులు మనలను ముందుకు నడిపిస్తాయి.మంచి చెప్తుంటే వినాలి.మూర్ఖత్వ ఆలోచనలకు ఫుల్ ష్టాప్ పెట్టండి.అన్ని తెలుసని బొందలో పడకండి.రేపటి గురించి,భవిష్యత్తు గురించి మననం చేయండి.అంతా మన చేతుల్లో.అంతా మన చేతల్లో.చైతన్యం కావాలి,ఉత్సాహంగా ఉండాలి.భయపడితే ముందుకు సాగలేము.ఏ సమస్యైనా ధైర్యంతోనే ఎదుర్కోవాలి.ముందు తరాలకు స్వాగత ద్వారాలు తెరుద్దాం.
ఆలోచించండి అంతా శుభం కలుగుతుంది.
ఈ కాలంలో జనులేంటో పిల్లలు వద్దని అసలు పెళ్ళీ వద్దనే మహా విజ్ఞానవంతులు తయారయ్యారు…ఎటు పోతుంది ప్రపంచం.చంద్రుని మీదకు కూడా చేరిన గొప్ప జ్ఞాన ఘనులు ఉన్న కాలంలో వున్నాం మరి.
———————–
డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
హస్తినాపురం, హైదరాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దరిద్రం వదిలింది! 

మన మహిళామణులు