తాతగారికి తగిన మనవరాలు.ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈమె మహిళామణి డాక్టర్ రాధాకుసుమ గారు
నా పేరు డాక్టర్ రాధా కుసుమ
హైదరాబాద్ నివాసిని.నాన్న పేరు కె.చెంచయ్య,అమ్మ పేరు రూపమ్మ.
షెడ్యుల్డ్ కులాల నేపధ్యం.తల్లి నిరక్షరాస్యులు.తండ్రి కష్టపడి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డారు.
పదవ తరగతి చదివేటప్పుడే వివాహం తొలి దళిత స్ఫూర్తి చైతన్య దీప్తి సమాజంలో హెచ్చుతగ్గులను నిరసించిన కుసుమ ధర్మన్న గారి మనవడిని వివాహం చేసుకోవడం జరిగింది.
వివాహం తర్వాత చదువుకోవడం జరిగింది. ఎంతో కష్టపడి ప్రైవేటు గా MA సోషియాలజీ చేయడం, comprehensive college of education Masabtank, Hyderabad నుండి B .Ed చేయడం ఆ తర్వాత 1992 లో ప్రభుత్వ పాఠశాలలో Secondary grade teacher గా హైదరాబాద్ లో ఉద్యోగం రావడం జరిగింది.
Ggps Ramnagar,Lalaguda no1 ,Addgutta High school ఇలా పాఠశాలల్లో ఉపాధ్యాయురాలు గా పని చేయడం జరిగింది.SA(Telugu) గా GGHS Kingsway పాఠశాల నుండి రిటైర్ కావడం జరిగింది.
నా వృత్తిలో ఎన్నో ప్రశంసలు
పొందిన వాటికంటే కూడా ఎందరో విద్యార్థులకు పాఠాలు బోధించడంలోనే ఎంతో ఆనందం లభించింది నిరుపేదలైన విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించడంలో ఉన్న ఆనందం ఎన్ని ప్రశంసలు దొరికినా కూడా మనకు లభించదు. కష్టాల్లో ఉన్న నిరుపేదలకి సహాయ సహకారాలు చేసి ఎందరినో విద్యావంతులుగా చేసిన ఆత్మ తృప్తి నాకు లభించింది.బాల్య వివాహాలు జరగకుండా వారి తల్లిదండ్రులకు వివరించి బాల్యవివాహాలు జరగకుండా కాపాడటం జరిగింది.చాలా మంది వయోజనులకు చదువు నేర్పించడం నాకు తృప్తిని ఇచ్చింది. పాఠశాలలో ఉన్నప్పటి నుంచి కూడా వృత్తిని నిబద్ధతతో నిర్వహిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేదాన్ని పిల్లల చేత అనేక కార్యక్రమాలను వేయిస్తూ ప్రదర్శనలు ఇప్పిస్తూ ఉండటం జరిగింది. తెలుగు భాష అంటే విపరీతమైన అభిమానం కలిగి ఉండేది అప్పటినుంచి ఇప్పటివరకు కూడా తెలుగు భాషలో ఎన్నో వ్యాసాలు రాయడం కవితలు రాయడం కథలు రాయడం పిల్లలకి సులభమైన విధానాల్లో బోధించడానికి తెలుగు భాష పట్ల అభిమానాన్ని వారిలో రేకెత్తించడానికి చాలా కృషి చేస్తూ ఉండేదాన్ని ఆ పర్వం ముగిశాక రిటైర్ అయిన తర్వాత కూడా అనేక పత్రికలకు కవితలు పంపుతూ వాట్సాప్ సమూహాల్లో అడ్మిన్ గా ఉంటూ ఆన్లైన్ పత్రిక సంపదకురాలుగా (మైత్రివనం పత్రిక) ఉన్నాను. హైదరాబాద్ నగరంలోనే కాక ఇంకా అనేక జిల్లాల్లో కవి సమ్మేళనాలను నేను అధ్యక్షత వహించి నిర్వహించడం చేస్తున్నాను కవితాలయం శ్రీ శ్రీ కళావేధిక కలం స్నేహం స్వర స్నేహం కథ స్నేహం మొదలైనవి
ఈ ప్రహసనంలో గౌరవ డాక్టరేట్ పొందడం జరిగింది.సమీక్షలు రాయడం,కవి పరిచయాలు చేయడం, వ్యాఖ్యాతగా,సంపదకురాలుగా, నిర్వాహకురాలిగా, రచయిత్రిగా సాహిత్య పయనం సాగుతున్నది.
డాక్టర్ రాధా కుసుమ
అవార్డులు:
ఉత్తమ ఉపాధ్యాయులు తెలంగాణ ప్రభుత్వం , రోటరీ, లైన్స్ క్లబ్,Apusమొదలైన వారి నుండి అనేక అవార్డులు.
National Exemplary Service Sir Arthur Cotton Award రాజమండ్రి .
కవితాలయం వారి ‘కవిరత్న పురస్కారం’కలం సహస్ర విభూషణ్ దాదాపు 6వేల కవితలు
‘మహిళారత్న’ జాతీయ విశిష్ట సేవా పురస్కారం.
సృజన సాహితీ వారి
‘కవితా శిరోమణి’ పురస్కారం.
కలం స్నేహం వారి
‘కలం భూషణ్’ అవార్డు.
నేటి కవిత వారి
‘కవితా భూషణ్.’
తెలుగు కవివరా వారి
‘కవిచక్ర’అవార్డు
సావిత్రి బాయి పూలే,వివేకానంద అవార్డు
అంబేద్కర్.సేవాపురస్కారం
జాతీయ సేవా రత్న అవార్డు
సాహితీ రత్న ఇలా ఎన్నో అవార్డులు లభించాయి
అనేక పుస్తకాలలో నా కవితలు అచ్చు వేయడం జరిగింది.రాధా కుసుమాలు,నా స్నేహం అనే కవితల పుస్తకాలు మన తెలంగాణా ప్రభుత్వ గృహమంత్రిగారి చేత పుస్తకావిష్కరణ చేసుకోవడం ఎంతో ఆనందకరమైన విషయం.
మా తాతగారు కుసుమ ధర్మన్న గారి పేరు మీద కుసుమ ధర్మన్న కళాపీఠం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందం.
ఆయన పేరు మీద ఎందరో మరుగున ఉన్న సాహితీవేత్తలకు సన్మానించి నాకు చేతనైనంత సహాయం అందజేయడమే నా జీవిత లక్ష్యం….