ప్రేరణ..

కవిత

సుష్మాశ్రీనివాస్. మెరుగు

దిగులు పడకు నేస్తమా…
కన్నీరు కార్చే కళ్లే…
హర్షించే కుసుమాలవుతాయి..
నిను చూసి అసూయపడే అక్షువులే …
నిను చూసే తరునంకై వేచిచూస్తాయి…
అమావాస్య అనంతరమే…,
వెలుగుల పౌర్ణమి….!!
ఏ నిమిషానికి ఆ నిమిషం…
యమయాతనే ఈ జీవితం ..
లేనివాటికై నిరాశ చెందక ..
ఉన్నదాoట్లో తృప్తి పొందు..
ఈ క్షణాన్ని….,,
ఆనందించు..అనుభవించు …!!
కాంక్షించే కలల ప్రపంచం అతి చేరువలోనే ఉంది…!!
భూతల స్వర్గాన్ని స్రుష్టించే సామర్థ్యం నీకున్నది ..!!
కడగండ్లు సవాలుగా స్వీకరించు..
ఎదురైన ఆటంకాలను ఆయుధంగా మలుచు…
కష్టసుఖాలను సమానంగా ఆదరించు..
జీవితపు పేజీల్లో….,,
‘కష్టo ” ‘సుఖం” రెండూ కలిస్తేనే పరిపూర్ణం….!!!

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంకల్పం

మన మహిళామణులు