వాక్కు,బుధ్ధి,వివేకము,విద్య విజ్ఞానము,కళలు వీటన్నిటికీ అధిదేవతసరస్వతి దేవి.
హిందూమతంలోనిముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతిదేవి చదువులతల్లిగాఆరాధింప బడుతుంది.
ఈ దేవి త్రీమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి.
నవరాత్రి,వసంతపంచమి, ఉత్సవాలలో సరస్వతీ దేవిఆరాధన,పూజలు విశేషంగా జరుగుతాయి.
ఈ అమ్మవారి గురించి చిన్నపాట.
“బుధ్ధిమంతుడు” సినిమా లోని, “నను పాలించగ నడచీ వచ్చితివా” అనే ఈ పాటకి “పేరడి”.
“పల్లవి, మము పాలించగ తరలీ వచ్చితివా, మొరలాంలించగ కదలీ వచ్చితివా
శ్రీవాణీ మము పాలించగ తరలీ వచ్చితివా.
“చరణం.1 కాశ్మీరు లోన వెలసిన శ్రీ శారదాదేవి, మా కొరకై
బాసర లో జ్ఞాన సరస్వతివై వెలసి దూర భారాల చేరగ లేమని
దయతో మాదరి చేర వచ్చి, మము కరుణించితివా
మొర లాలించగ కదలీ వచ్చితివా వాగ్దేవీ.
“పల్లవి”. మము పాలించగ తరలీ వచ్చితివా మొర లాలించగ కదలీ వచ్చితివా
శ్రీవాణీ మముపాలించగ తరలీ వచ్చితివా ఆహా హా.
“చరణం”.2 సృష్టి కర్తకే నీవు వలపుల రాణీ వాణి,భూలోకము లోన
వెలసీ,మా తలరాతలు మార్చి, సకల కళలను,మాకందించే
అధి దేవతవై పూజలందగా తరలీ వచ్చితివా
మొరలాలించగ కదలీ వచ్చితివా దేవేరీ ,
“పల్లవి”. మము పాలించగ తరలీ వచ్చితివా మొర లించగ కదలీ వచ్చితివా
శ్రీ వాణీ మముపాలించగ తరలీ వచ్చితివా ఆహా హా….
“చరణం”.3 భవ బంధాలలో తలమునక
లైన మమ్ము,నీ పావన గంగా జలమున మాపాపాల రూపు మాపి
మోడు వారినా జీవితాలలో వసంతాలను పూయించుటకై
తరలీ వచ్చితివా మొరలాలించగ కదలీవచ్చితివా దేవేరీ…
“పల్లవి”. మము పాలించగ తరలీ వచ్చితివా మొర లాలించగ కదలీ
వచ్చితివా శ్రీవాణీ….మము పాలించగ తరలీ వచ్చితివ శ్రీవాణి.