చదువు

కథ

అరుణ పరఁధాములు

“ఏమ్మా రోని బడికి వెళ్లకుండా పని చెయ్యటానికి వెళ్తున్నావు ” అని అడిగింది ఇంటి
వెనకనున్న సుమతి.

“నాకు ఇక చదువు రాదని మానాన్న మరియు సర్ నిన్న ఓ నిర్ణయనికి వచ్చారు”
బాధగా చెప్పింది రోని “చదువేముందిరాగడ్డి తిన్నంత సులువు”*
అంది సుమతి.

“అలనా ఎలా?” ఆశగా అడిగింది రోని.

అప్పటికే పొన్ కాల్ వుంది . “ముందు నన్ను కాస్త మాట్లాడనివ్వు
తరువాత చదువు మర్మం చెపుతా “అని కాల్ లో మునిగి పోయింది సుమతి.

కాసేపు ఓపిక పట్టిన రోని “ఎం చేస్తున్నావ్ అక్క ?
నాకు ఎదో చెపుతానని నీవు కాల్ ఉన్నావ్” అని అడిగింది.
.
నేను ఏకాగ్రతగా *వాళ్ళు చెప్పింది వింటున్న * మాట్లాడకూ అంది సుమతి .

అదేమిటి కొత్తగా ఉంది అని రోని అనగా క్లాస్లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు వినటం లాంటిదే ఇక్కడ శ్రద్ధ అవసరం.
అర్ధమైన కాకున్నా ముందు వాళ్లు చెప్పేది మనం వినాలి.

“పది సార్లు చదివటం కన్నా ఒక్కసారి వినటం మిన్న”
ఇది చదువు మొక్క మొదటి లక్షణం.

ప్రతివారికీ తినటంలో ఉన్న శ్రద్ధ వినటంలో కూడ ఉండాలన్నమాట*
అనుకున్నది రోని మనుసులో

కాసేపు గడిచాక రోని , సుమతి ఇద్దరూ చెట్టు కిందకు చేరారు.
“అదేంటక్క కల్లు మూసుకొని నీలో నువ్వేఎదో మాట్లడుకుంటున్నావు”
వింతగా అడిగింది రోని.

దానికి సుమతి నవ్వుతూ ….. దీనిని నెమరు వేయటం
అంటారు.

“ఎందుకలా” అడిగింది రోని . టీచర్ చెపుతున్న చాలా విషయాలు అప్పటికి బాగుంటాయి అర్థమైనట్టు అనిపిస్తాయికానీ కాసేపటికి మర్చిపోతాం.
అందుకే ఇంటికి వచ్చాక తీరుబడి గా నెమరు వేసుకోవాలి.
ఎవరికైతే నేమరు వేసే అలవాటు ఉంటుందో వారికే చదువు అర్థమౌతుంది

నిజానికి చదువు లోని మర్మం ఇదే.అని రహస్యం చెప్పింది సుమతి.

రోనికి తన పొరపాటు ఇప్పుడు అర్ధమైంది. ఏనాడు తనూ ఆ పని చెయ్యలేదు తాను ఏనాడు ఇంటికొచ్చి చెప్పిన పాఠం నెమరువేసుకోలేదు
పుస్తకం ముట్టింది లేదు. సాయంత్రమయ్యింది అంటే చాలు
T. V చూస్తూ..కబుర్ల తో కాలం గడిపేది ..అందుకేనా! నాకు చదువు…
ఒంటపట్టటం లేదు . అని తెలుసుకుంది రోని

ఒక పేరును, గుర్తింపును, జీవితంలో ఓ వెలుగు, ఓ మెరుపు వస్తాయి అది కేవలం చదువుతోనే అని అర్థమైంది రోనికీ.

రోని గుండె పట్టుదలతో కొట్టుకోగా రక్తం వేగంగా పంతంగా పరిగెత్తింది.చేసిన పోరపాటు తెలుసుకుంది
ఇంతేనా ఇంకేమైనా ఉందా? ఆలోచనతో మనస్సు తృప్తి కలిగింది.

ఈ పని ఈ రోజు డబ్బునిస్తుంది రేపు….నా భవిష్య త్ ….. జీవితం ..కష్టపడటం తప్ప వెరే మార్గం లేదు
ఆర్థిక స్వేచ్చ వుండదూ ఆదారపడి బతుకటమే అని తెలుసుకోని….ఆ రోజునుంచే చదువటం మొదపెట్టింది రోని.

పనికి మాలిన పనులు వదిలేయడం కబుర్లు…. సెల్ ఫోన్,స్నేహాలు.
tv లు ముచ్చట్లు …. వీటిని వదిలెయ్యాలి అప్పుడు నీవు చదువు కోవటానికి మరింత సమయం దొరుకుద్ది.
అని నవ్వుతూ చెప్పి ముగించింది సుమతి.
నెల గడిచింది. రోని కి SA 2 ప్రోగ్రెస్ కార్డు ఇస్తూ సర్….
ఆశ్చర్యముగా చూసాడు.
చదువ లేదు! అనుకున్నా అమ్మాయి చదువగలను అని నిరూపించడం…
రోని కీ ఇన్ని మార్కులా!అన్నట్టుగా…..

ఈ సారి రోని ఇంటి కెళ్లకుండా నేరుగా సుమతిక్క వద్దకు బయలు దేరింది.
“ఆ ” రోజు సాయంత్రం రోని
నడిచిన నడకలోని శక్తి కనిపిస్తుంది.

ఆ ఇద్దరూ రోని మార్కులు చూసి షాక్ అయ్యారు…
కృషి, పట్టుదల వుంటే సాధించలేనిది ఏదీ వుండదూ కదా అన్నట్టుగా
ఈ ఇద్దరూ మెచ్చుకొకుండ వుండలేకపొయ్యారు…

రోని వాళ్ల నాన్న కళ్లుల్లో నీళ్లు కూతుర్ని చూసి …….

చదువు గురించి చెప్పిన సుమతిక్క నాకెందుకులే అనుకోని వుంటే నేను నా భవిష్యత్ అని రోని …..

“చదువు విలువ లెలుసుకో జీవితాన్ని మలుచుకో” అని రోని పని చెసే ప్రతి అమ్మాయికీ
చెప్పటం మొదలుపెట్టింది.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సూర్య నమస్కారాలు

చిత్తుప్రతి