ఆమె జాయింట్ డైరెక్టర్ గా టి.ఎస్.మోడల్ స్కూల్స్ కి పనిచేస్తూ ఒక కవయిత్రి గా రాణిస్తున్నారు.ఆమెకి వంశంలోనే సంగీత సాహిత్య అభిరుచి ప్రవేశం ఉండటం పూర్వజన్మ సుకృతం.తండ్రిశ్రీపాలడుగు నాగయ్య గారి కి తగిన తనయ.నాన్న ఎస్.జి.అధ్యాపకులు.బడిలో సార్ అని ఇంటికి రాగానే నాన్నా అని పిల్లలు తండ్రిని అల్లుకుపోయేవారు.బడిలో పిల్లలకు పాఠాలు పాటలు బుర్ర కథలు చెప్తూ రేడియో లో టి.వి.లో ప్రోగ్రాంలు ఇచ్చిన తండ్రితో పాటు సరోజిని కూడా పాల్గొన్నారు.1972 లో తొలిసారిగా కుటుంబం రవీంద్ర భారతిలో బుర్ర కథ చెప్పడంతో జనం దృష్టిలో పడ్డారు.
కానీ విధికి కన్ను కుట్టింది.ఆల్రౌండర్ తండ్రి హఠాత్తుగా మరణించడం సరోజినికి కోలుకోలేని దెబ్బ.ఇంటర్ చదువుతున్న ఆమె పై కుటుంబ భారం పడింది. ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లి అమ్మ ను చూసుకుంటూ టీచర్ గా చేరి అంచెలంచెలుగా ఎదిగిన ఆమె జీవితం స్ఫూర్తి దాయకం.
భర్త నర్సింగరావు తోడ్పాటుతో ఇటు సంసారం అటు ఉద్యోగం తో పాటు ఆయన తో కలిసి నాటకాలు ఒగ్గుకథలు బుర్ర కథలు చెప్తూ గుర్తింపు తెచ్చుకున్నారు.ఆడియో వీడియోలు చేస్తూ 30మంది గురుకుల పిల్లలచేత డాన్స్ చేయించారు.
బడిబాట హరితహారం గూర్చి పాటలు రాశారు.130మంది పిల్లలతో డాన్స్ చేయించారు.కొత్తగూడెంలో కరోనా పాటను నల్గొండ స్టూడియో లో డేవిడ్ గారి చేత కంపోజ్ చేయించారు.ఆమె స్వయంగా కమ్మగా పాడుతారు.పాటకి భావంకి ప్రాణం పోస్తారు.
ఎం.ఎ.బి.ఇడి చేసిన ఆమె సంయుక్త సంచాలకులు కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ గా నల్గొండ కొత్త గూడెం మొదలైన చోట్ల డి.ఇ.ఓ.గావరంగల్ బి.ఇడి.కాలేజ్ ప్రిన్సిపాల్ గా పనిచేసిన సవ్యసాచి . పిల్లలని ప్రోత్సహించే విద్యాధికారి గా అందరి మన్ననలు పొందారు.పొందుతున్నారు. తండ్రి జయంతి 19.7.23 నపాలడుగు నాగయ్య కళాపీఠం ని నెలకొల్పి తొలి కవితా సంపుటి సరోజినీ దేవి కుసుమాలు వెలువరించారు.
ఒక కుమార్తె ఇద్దరు అబ్బాయిల తల్లిగా వారి కి ఆదర్శమాతగా తన బాధ్యత నిర్వహిస్తున్నారు.నిగర్వం నిరాడంబరత ఆమె సొత్తు.ఎదిగినకొద్దీ ఒదిగిన కళా సాహితీ మూర్తి.తండ్రి పేరున ఎన్నో సేవా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఆమె కష్టాలకొలిమిలో రాటుదేలిన భావిభారత బాలల్లో సంగీత సాహిత్య అభిరుచి కల్గిస్తున్న సరోజినీ దేవి నేటి మహిళామణి అనటంలో ఎలాంటి సందేహమూ లేదు.ఆమెకు తరుణి తరుఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ఆమె ఫోన్ 9248793710