“భావ ప్రకంపనలు”.

   వై.అరుంధతి

ఎప్పుడేమి చేయ్యాలో ఎరుగనైతినే
ఎవరితో ఎలా పలకాలో
తెలియనైతినే .
ఏ అడుగు ఎపుడెటు మోపాలో
తోచకున్నదే,

దిక్కుతోచని అయోమయ స్థితి లో గిలగిల లాడేనే,
గాలివానకు నేలకూలిన
పూలతీగ నైతినే,

ఎప్పుడెవరి కాలికింద పడి
నలిగేనో,
ఏ మేక నోట కరిచి నమిలేనో
నా చుట్టూ కంచె వేసి కాపాడగరావా

చేయూత నిచ్చి నన్ను చేరదీయలేవా,
అంతులేని ఈ అంతర్మథనం
మోయలేని భావ ప్రకంపనం.

భూప్రకంపనలో లావా పొంగి
బయట కొచ్చినట్టు,
తట్టుకోలేక చిన్ని గుండె పగిలి
కళ్ళ నుండి జాలువారె రుధిరధార.

ఇక దరిచేరి దారిచూపు కరుణాలవాల
అమ్మా ఆది మాతా
పలికించు నానోట నీ నామస్మరణా .
నడిపించు నీ ఆలయ ప్రాంగనాణ .

నా కన్నుల నీ రూపం అనుక్షణం కదిలేలా ,
నా గుండెలో నిండిపో నిరంతరం స్థిరముగా
మనిషి తనం మానవత్వం కనుమరుగు కాని అనిర్వచనీయ                                                                                   భావాలను ప్రజ్వరిల్లచేయవా నాలోన లోలోన
ప్రజా వాణి లోన!
_*_

Written by Y. Arundhati

Y.ARUNDHATI.
NIZAMABAD.
8639617444

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మానవత….

మహిళామణులు