బతుకమ్మ పాటలు …

పాట

శ్రీరాము నీ తల్లి వుయ్యాలో
శ్రీమతి కౌసల్య వుయ్యాలో
తన బిడ్డ శాంతనూ వుయ్యాలో
తల్లి చేరా బిలిచి వుయ్యాలో
అత్త వారింటికి వుయ్యాలో
ఆనందమున బొమ్ము వుయ్యాలో
అత్త మామల సేవ వుయ్యాలో
అతి భక్తి తోసల్పు వుయ్యాలో
అందువలనా నీకు వుయ్యాలో
ఐశ్వర్యమబ్బునూ వుయ్యాలో
యిరుగు పొరుగిండ్లకూ వుయ్యాలో
తిరుగబోవద్దమ్మ వుయ్యాలో
అందువలన నీకు వుయ్యాలో
అపకీర్తి కలిగేను వుయ్యాలో
అపకీర్తి కంటేను వుయ్యాలో
అతివ అపకీర్తి వద్దమ్మ వుయ్యాలో                                                                                                         సాధులైన ఋషులు వుయ్యాలో


సమయానికీ వస్తె వుయ్యాలో
అన్నపానాదుల వుయ్యాలో
ఆదరించు తల్లి వుయ్యాలో
వారినీ సేవిస్తే వుయ్యాలో
వైకుంఠ మబ్బునూ వుయ్యాలో
పతియేదైవామనుచు వుయ్యాలో
మదినివుంచవమ్మ వుయ్యాలో
అందువలనా నీకు వుయ్యాలో
ఆనందము గల్గు వుయ్యాలో
మళ్ళియీ మాసమ్మునా వుయ్యాలో
తిరిగి తోలుకవత్తు వుయ్యాలో .

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పరాన్న భుక్కులు

కొండంత పండుగ