వంట

కవిత

పాముల జ్యోతిర్మయి హైదరాబాద్.

వంట,రెండక్షరాల తేలికైన పదమంట
ప్రతినిత్యం ప్రతి ఇంటా జరిగే ఓ మహాయజ్ఞమంట
నేర్పు, ఓర్పు, సమయస్ఫూర్తులతో కూడిన ఓ కళయంట
అది ఆడవారికి వెన్నతో పెట్టిన విద్య
అని నేనంట
పాకశాస్త్ర ప్రవీణులు నల భీములు కూడా
ఉన్నారంట


ఐనా అమ్మచేతి వంట అమృతమంట
దానికి సాటి మరేది రాదంట
ఎందుకంటే ముగ్గురమ్మల మూలపూటమ్మ
ఆదిశక్తి అంశలమంట.
అందుకే ఆడవారికి సాధ్యం కానిది
ఏదీ లేదంట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కోడలు పిల్ల

ఆలోచన