బతుకమ్మ నిజమైన Woman empowerment

– డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి సంపాదకులు

స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానత్వం స్వేచ్ఛ ఉండాలనే వాళ్ళు ఉన్నారు. కానీ, ఇది సార్థకత చేకూరేలా అమలుకోసం ప్రాతినిధ్యం వహించే వాళ్ళు తక్కువ.అందుకే ఆడవాళ్లు ఎప్పటికప్పుడు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగమే ఈ పండుగలు పర్వదినాలు ఉత్సవాలు నిర్వహించడం.
పండుగలు వస్తాయి పోతాయి. మళ్ళీ ఏడాదికి వచ్చినప్పుడు కూడా ఇదే తరహా.ఈ వచ్చిపోయే కాలం లో మనం ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్య విషయం.
బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఇది పూల పండుగ. స్త్రీ ల పండుగ. ఇది పాటల పండుగ. స్త్రీ ల భావాల పండుగ.
మహిళలు నాయకులయ్యేలా ప్రేరణవ్వాలన్నా, మహిళలు మహరాణులయ్యేలా కుటుంబాలు చూడలన్నా ఈ బతుకమ్మ పండుగ నాడు చూడాలి! స్త్రీ లు వాళ్ళ ఇష్టం గా ఆడుకుంటారు పాడుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. నేర్పుతుంటారు.
సామూహికంగా నిర్వహించడం వల్ల కలివిడి తనం కలుగుతుంది. దీనిద్వారా తెలివిడి తనం అలవడుతుంది. చైతన్య వంతంగా ఆలోచిస్తారు. ఆదర్శ వంతంతం గా ముందుకు నడుస్తారు.
లోకం పోకడ చూస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్త లూ తెలుసుకుంటారు.
అందంగా తయారయి నలుగురు స్నేహితుల తో ఉల్లాసంగా ఆటలు ఆడుతుంటారు కాబట్టి ఉత్సాహంగా ఉంటారు. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. పాటలు పాడుతుంటారు కాబట్టి గళం విప్పారుతుంది. ఉచ్చారణ సరిగ్గా చేయడం అలవర్చుకుంటారు.
ముఖ్యంగా ఈ బతుకమ్మ పాటల్లోని సాహిత్యం మనసుకెక్కించుకుంటారు . భావాన్ని గ్రహిస్తుంటారు. ఇంతకన్నా ఏంకావాలి?
తల్లిదండ్రులు చెప్పే నీతి సూత్రాలు పాటలలో ప్రత్యక్ష మవుతాయి . తర తమ భేదాలు తెలుస్తాయి. భర్త తో ఎలా మెలగాలి , అత్తమామలలో ఉండాలీ తెలుసుకోగలుగుతారు.
సృష్టి కి మూలం ఎవరు? ఏ దేవత ఏమిటి అనేదీ గ్రహిస్తారు .
శ్రమ గీతా లూ ఉంటాయి కాబట్టి, ఏ విధంగా శ్రమ దోపిడీ అవుతుంది బతుకమ్మ పాటలు చెప్తాయి.
దీనితోపాటు సుకుమార సుగంధ పరిమళాలలా హృదయం లో నింపుకోగలరో, మృతి , దాని పర్యవసానాలు అర్థం చేసుకుంటారు.

పురాణ కథలు గాథలు కాలగర్భంలో కలిసిపోకుండా బతుకమ్మ పాటలు కాపాడుతాయి.
తెలియని పదాల అర్థాలు తెలుసుకోగలుగుతారు. ఇదంతా మౌఖిక సాహిత్యమే! కర్త ఎవరో తెలియదు.
ఏ కవీ రాయకుండా ఇంత సాహిత్య ఎలా ఇన్నేళ్ల గా ఎలా నిలిచి ఇప్పటి ఈ కొత్త తరానికి కూడా అందింది అనే ఆశ్చర్యం తో రేపటి తరానికి కూడా అందించాలనే తపన ను అలవరుస్తుంది.
ముఖ్యంగా మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. మనదైన సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకుని తమ పిల్లలకు చెప్పే స్థాయికి మెట్టలెక్కించేలా చేస్తాయి.
ఆధునిక కాలంలో నడిచొచ్చే న్యాయ వ్యవస్థ ఏదైనా ఉన్నదా అని అంటే అది కేవలం బతుకమ్మ పండుగ పాటలు విశిష్టత అనేలా కొత్త కొత్త పాటలు వస్తున్నాయి. గతం లో తెలంగాణ స్వాతంత్ర్య పోరాటానికి ప్రాణవాయువు లా స్త్రీలు కూడా ఉన్నారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ బతుకమ్మ పాటల్లోని సాహిత్యం. దుర్మార్గాలను ఎండగట్టినా, సన్మార్గంలో నడవమని చెప్పినా బతుకమ్మ పాటలు చైతన్య స్రవంతి గా నడిపించగలవు. స్త్రీ శక్తి సామర్థ్యాలపై తక్కువ భావన ఉన్నవాళ్ళకు చెప్పని పాఠాలు గా కూడా అయ్యేలా నవగీతాలూ ఉద్భవించాలి . ఉద్భవిస్తాయి. ఈ అవసరం లేకుండా పురుష సమాజం నడుచుకుంటే సభ్య సమాజం నడుచుకుంటే విప్లవాత్మక నిర్ణయాలు కూడా రావు.
చదువు కేవలం అలంకారం కాదు. సంస్కారం, ఆలోచనా శక్తి, జ్ఞాన సంపదా ఇవ్వాలి. ఇస్తుంది. కానీ ఎవరైతే చదువుకోవాల్సిన కాలాన్ని సద్వినియోగం చేసుకుని చదువును సత్యనిష్ఠ తో చదవాలి అనే నీతిని నేర్చుకున్న వాళ్ళవ్వాలి ఆడపిల్లలు . ఆడపిల్లలు అపర కాళి రూపాలయ్యే ధైర్యం ఇవ్వాలి ఈ బతుకమ్మ పాటలు.
బతుకమ్మ పాటలతో ఆటలతో ఆరోగ్యం ఆనందం కలగాలి.
సుభిక్ష మైన పండుగ బతుకమ్మ.
త్రిశక్తి రూపం. లక్ష్మీ పార్వతి సరస్వతి కొలువు తీరిన స్వరూపం బతుకమ్మ స్వరూపం.
పూలు లక్ష్మీ దేవికి, పాట సరస్వతీ దేవి కి ఆట పార్వతి దేవి కి చిహ్నాలు.
బతుకు నేర్పే పండుగ బతుకమ్మ పండుగ! బతకమనే పండుగ !!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉత్సాహం గా గణపతి ఉత్సవాలు

నువ్వు అట్లన్నావని…