ఉత్సాహం గా గణపతి ఉత్సవాలు

రాపోలు శ్రీదేవి

అది ఒక అపార్ట్మెంట్ అందులో …20 కుటుంబాలు జీవిస్తున్నాయి. అందులో మాదొక
కుటుంబం …
కొందరు బీరకాయ పీచు చుట్టరికం దాంతో అందరం ఓ కుటుంబ సభ్యుల వలే
వరసలతో పిలుచు కుంటూ ఉమ్మడి కుటుంబం లా ఉంటాము

అందరం ఎవరికి తోచినంత వారు ఇచ్చి వినాయకుని నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టాము.

ఒక కుటుంబం వారు అందమైన వినాయకుని కొని తెచ్చారు

మరొకరు ఇంటింటికి మట్టి విగ్రహాలు ఇచ్చి పర్యావరణ రక్షణనకు తోడ్పడ్డారు.

వినాయక చవితి రోజు ఉదయం ఇంట్లోనే గణపతి పూజ చేసి సాయం సంధ్య వేళ అంతా కలిసి ఇంకా కలిసి వినాయకుని అందంగా అలంకరించిన పీఠంపై ప్రతిష్టించి ఇరువైపులా విగ్రహ దాత కుటుంబ సభ్యులు కూర్చొని భక్తిశ్రద్ధలతో పూజలు
చేశాం.

అందరం తీర్ధ ప్రసాదాలు తీసుకున్నతర్వాత …

ఎవరికి వారే ముచ్చటిస్తూకూర్చున్నారు అందరి దృష్టి మల్లిస్తూ..మైక్ పట్టుకొని అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు
తెలిపాను.

5వ అంతస్తులో ఉండే స్వప్న వాళ్ల అమ్మాయి అద్విత
“శుక్లం వరధరం” శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభించాము ..

ఆంగ్ల మాధ్యమం లో చదివే నేటి తరం పిల్లలకు మన పండుగ ల యొక్క విశిష్టత గురించి చెప్పాలని అనుకున్నాను.
కానీ మా మొదటి అంతస్తు లో ఉండే పావని అశోక్ ల బాబు సన్నీ వినాయకుని కథలు చెప్పి అందరి మెప్పు పొందాడు.

తర్వాత పిల్లలంతా కలిసి పాటలు పాడుతూ ఆటలాడుతూ ఆనందంగా గడిపారు పిల్లలే కాదు వారి తల్లులు అంటే మేము కూడా కోలాటాలు ఆడాము.
ఆనందంగా వినాయకుని మొదటిరోజు గడిచింది..తీర్థ పరసాదాలతోటే కడుపునిండింది.

రెండవ రోజు ఒక రెండు కుటుంబాలు కూర్చొని పూజలు చేసి నైవేద్యాలు దేవునికి సమర్పించాక అందరికీ ప్రసాదాలు పంచి పెట్టాం .

అందరం కలిసి ఆటపాటలతో ఆనందంగా గడిపాము.

ఆడవారమంతా అందంగా ముస్తాబై అందాల పోటీ ప్రదర్శన లు ఇచ్చినట్టు తిరుగుతూ ఆనందించాము..
“అందమే ఆనందం” అంటారు కదా మరీ..

ముచ్చటగా మూడోవ రోజు పిల్లలు పొడుపు కథలు వేస్తూ అందర్నీ ఆట పట్టించారు..
పంతులు గారు ఆలస్యంగా రావడంతో ఎక్కువ సేపు డాన్స్ లు వేయ లేదు..

ఐదవ రోజు ముత్తైదువులమంతా కలిసి కుంకుమార్చనలు చేశాం.

సాయంత్రం వేళ పిల్లలు చూపిన ఉత్సాహానికి ప్రోత్సహించిన ట్టు ఉండాలని బహుమతులు ఇచ్చాం
అవి కూడా వేరే బహుమతులు మార్పులు చేర్పుల తో వినాయకుని ఫోటోల తో అందంగా చేసి పిల్లలకిస్తే చాల సంతోషించారు
“పిల్లల కు ప్రోత్సహమే పోషకం” కదా మరీ..

ఆరవ రోజు ఫ్లోర్ ఫ్లోర్ కి ఓ రకం వంట చొప్పున వంటలన్నీ చేసుకుని మధ్యాహ్నం వేళ భోజనాలు చేసి సాయంత్రం వేళ వినాయకునికి గుమ్మడికాయ దిష్టి తీసి కోలాటాలతో ..
పిల్లలు పెద్దలు దరువు తగ్గట్టు ఊపు తో ఉత్సాహంగా నృత్యాలతో వినాయకుని ఊరేగించాము.

దేవునికి నీళ్లు ఆరబోసి వచ్చి ఖాళి బిందె తో
“కడువెత్తు కొచ్చింది కన్నెపిల్ల ” అనే పాట కు ఆనందంగా చిందులు వేశాం..

ఎదురు అపార్ట్మెంట్ వాళ్లతో పోటి పడుతూ మొదటి సారి అయినా బాగానే చేశాం..
మా బిల్డింగ్ ఓనర్స్ కూడా మమ్మల్ని అభినందించారు.. కొన్ని విమర్శలు కూడా ఎదురు కున్నాం..
వినాయకుని నిమజ్జనం చేసి వచ్చి భోజనాలు చేశారు..

అందరం కలసి మెలసి ఆట పాటలతోనే కాదు..రుచి కరమైన వంటల తో భోజనాలు
ఏర్పాటు చేయడం అందరి కి సంతోషం కలిగించింది.
“ఐక్య మత్యమే మహ బలం” అని అంటారు కదా…

వినాయక చవితి అంటేనే ఐక్యత కు నిదర్శనం..కదా మరీ..

Written by Rapolu Sridevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బ్రతుకు నిచ్చే అమ్మ బతుకమ్మ

బతుకమ్మ నిజమైన Woman empowerment