ప్రపంచమే ఒక నాటక
రంగమైతే అందులో
అంత్యంత కీలకమైన
పాత్ర “అమ్మ. ”
ఎటువంటి బహుమతులూ,
అవార్డులూ ఆశించని,
నిస్వార్థప్రేమకు రూపం,
త్యాగానికి అర్థం “అమ్మ.”
నిరంతరం కృషి చేస్తూ, తన
ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్య
కుండా బిడ్డలు బాగుంటే చాలనుకుంటుంది” అమ్మ”.
కూటికి లేక పోయినా,
కాయకష్టం చేసైనా తన
పిల్లల కడుపు నింపుతుంది
“అమ్మ.”
కోట్లు గడించినా అమ్మను
చూసుకునే టైం లేదంటూ
అనాధాశ్రమం పాలు
చేస్తున్నారు పిల్లలు, అయినా
క్షమిస్తుంది, “అమ్మ.”
ఇక్కడికెందుకొచ్చావని,
ఎవరైనా అడిగితే ,అందరితో
కాలక్షేపం బాగుంటుంది,
అంటుందే కానీ ,పిల్లల పై
చాడీలు చెప్పదు. “అమ్మ.”
మనవలు, మనవరాళ్లతో
ఆడుకుంటే దొరికే ఆనందం,
ఇక్కడ దొరకదని తెలుసు,
మదన పడుంతుందే కానీ ,
బద్నామ్ చేయదు”అమ్మ.”
ప్రపంచంలో అత్యంత
దరిద్రులూ, దుర్మార్గులూ,
దుష్టులూ ఎవరయా?అంటే,
అమ్మ మనస్సర్థం చేసుకో
లేనివారు, అమ్మ ను చేజేతులా బయటకు నెట్టినవారు.
అలాంటి వారిని ఆ
భగవంతుడు కూడా
అస్సలు క్షమించడూ ,
క్షమించడూ, క్షమించడు.