పాదరక్షలు

అందరి పాదాలకు రక్షణ కవచమై నిలుస్తూ

      రాధిక సూరి

అలరించబడే పాదరక్షా! నిన్ను అవసరార్థం

ధరించేవారు కొందరైతే దర్పంగా భావించేవారు
ఇంకెందరో కదా! కరకు పాదాలకింద కర్కశంగా నలిగినా
సున్నిత పాదాలకు అందమైన అలంకారంగా బాసిల్లినా
తర తమ భేదాలెరుగక అందరి కాలిలో పొందికగా
ఒదిగుండే పాదరక్షా! రంగుల కలయికతో భిన్న ఆకృతులలో
అందంగా మలచి నీ కొక విలక్షణ స్థానమిచ్చిన చర్మకారుడెంత
కళాహృదయుడో కదా! ఆపద్భాంధవుడైన దాశరథి పాద పద్మాలలో
వినయంగా ఒదిగిన నీకు పట్టంగట్టి ప్రాభవం ఒసగిన భరతుడెంత
ధర్మాత్ముడో కదా! అరుదైన గౌరవంతో అలరారిన నీ జన్మ చరితార్థమాయె కదా

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రాతి బొమ్మ

బెస్ట్ టీచర్ అవార్డ్