గజల్

యలమర్తి చంద్రకళ

అమ్మవడి స్వర్గమే
ప్రేమిస్తు ఉండాలి
నీజన్మ దాతనే
పూజిస్తు ఉండాలి

ఒకస్త్రీ నీవనీ
క్షణమైన మరువకే
లోకమే చెడిపోయె
గమనిస్తు ఉండాలి

ఒంటరిగ నువ్వెపుడు
రెప్పయిన వెయ్యకే
చదువులే చదివినా
పరికిస్తు ఉండాలి

మృగాలే మనుషులుగ
తిరిగేస్తు వున్నాయి
చెడుచూపు పడకుండ
విదిలిస్తు ఉండాలి

మనసార నువ్వెపుడు
ఆదమరచి నవ్వకే
కళ్ళలో కాంక్షనే
పట్టే స్తు ఉండాలి

కాలనాగులేవో
నీవెనకె తిరిగేను
నాగినివై పడగెత్తి
కాటేస్తు ఉండాలి

ఏక్షణం యేమనసు
విషంగా మారునో
నీడనైన ఎప్పుడూ
ప్రశ్నిస్తు ఉండాలి

యేపుర్రె బుద్దిలో
యేపురుగు దాగెనో
కాళికగ నీవెపుడు
ఖండిస్తు ఉండాలి

చందురుడు నీకొరకు
సాక్షిగా రాడులే
అంతటా తెలివిగా
అడుగేస్తు ఉండాలి
–//–
నేడు స్త్రీలపై అడుగడుగునా జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాలు చూసి బాధా తప్త హృదయంతో నా కలం వ్రాసిన గజల్. స్త్రీ ఎలా ఉండాలి. ఎలా చుట్టూ వున్న పరిస్థితులు అంచనా వెయ్యాలి. అనే అంశాలతో వ్రాసాను.

Written by Yalamarti ChandraKala

పేరు : చంద్రకళ యలమర్తి
భర్త : సతీష్ చంద్ర యలమర్తి
చదువు : M Com
వృత్తి : ఉపాధ్యాయినిగా కొన్నేళ్ళు, ప్రస్తుతం గృహిణి
రచనలు : 300 కవితలు,
200గజల్స్, 4 నవలికలు,
4 గొలుసునవలలు, 200 పద్యాలు. కొన్ని ఆధ్యాత్మిక వ్యాసాలు, హిందీ నుండి తెలుగుకు "తులసిదాస్ రామ చరిత మానస్ " అనువాదం చేసాను.
కొన్ని హిందీ రూమి సూక్తులు తెలుగులో కి వ్రాసాను.
తానా, కెనడా తెలుగుతల్లి,
వారినుండి, అచ్చంగా తెలుగు, రవళి, వాల్మీకి, తపస్వి మొదలగు గ్రూప్స్ నుండి కథలు, కవితలకు బహుమతులు, సత్కారాలు అందుకున్నాను.
నా కథ ఒకటి పవిత్ర పేరుతో skit గా తీసారు.
ఒక కవితా సంకలనం అక్షరాల్లో నేను ప్రచురణ చేసాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వినాయక చవితి నానీలు

తొలిపాఠం