ప్రేరణ. చిన్న చిన్న పిల్లలు చెత్త ఏరుకొని scrap shops లో అమ్మటం చూసా.పెద్ద పెద్దScrap godowns Musarambad దగ్గర చూసా.కరోనాలో అనాధ పిల్లపరిస్థితి విన్నా.దీపావళి కి టపాకాయలను ఏరుకునే పసికందు లను చూసా . చిత్తూరు జిల్లా లో మావారు Indian Bank పని చేసారు.అక్కడి ప్రజల.మంచి తనం మాండలికం వ్యవహారాలు పరిశీలించి వ్రాసినదే ఈకధ.మనిషిలో పట్టుదల,దానికితగ్గ ప్రయత్నం,నిరాశని తరిమిగొట్టి నీకు నేను ఉన్నాను అని వెన్నుథట్టేవాళ్శుంటే ఈ దేశంలో అనాధల ఆకలి ఆక్రందనలు ఉండవేమో!ఏమో!
గోనెసంచి పక్కన పెట్టుకొని మువ్వన్నె జెండా గట్టుమీద తల ఆన్ఛి కూర్చున్నాడు ఈరిగాడు.
ఎదురుగా బోసినవ్వుల గాంధీ బొమ్మ చేతిలో కఱ్ఱతో. ఈదురుగాలి వీచినప్పుడు ఆ కఱ్ఱ ఊగుతూ ఏదో సందేశమిస్తున్నట్లుంటుంది.సాయంత్రం గూటికి చేరే పక్షులు గాంధీబొమ్మ తలమీదనో బుజాల మీదనో వాలి సేద తీర్చకుంటూ ఉంటాయి.ఈరిగాడికి ఆగాంధీ బొమ్మంటే ప్రాణం. ఏదో తెలియని బంధం ఉందనిపిస్తుంది.
“ఈ బొమ్మలోలానే తాత ఉండేటోడు.”స్వగతంలో అనుకోబోయి బైటకన్నాడు. ఆలోచనలు తాత చుట్టూ పరిభ్రమించ సాగాయి.
“తాత ఎప్పుడు కామందు రాజన్న నాయుడింట్లో పేడకడలెత్తుతూ గొడ్లకి సేవ చేసేవాడు. ఈబొమ్మలో తాత లానే తన తాత కూడా చిన్నగోచీ కట్టుకుని తిరగేవాడు.అయితే తన తాత బొమ్మ ఎక్కడాలేదు.” అనుకున్నాడు ఈరిగాడు.
ఈయన బొమ్మ అక్కడెందుకుందో అన్న ఆలోచన రాని అమాయకుడు ఈరన్న. కారణం అది గాంధీ బొమ్మకాదు ఈరిగాడికి.తనకు ప్రాణబిక్ష పెట్టిన ఈ తాతలో తనతాత ఉన్నాడన్న గట్టి నమ్మకం.
సశేషం