Dr. Sunitha Rammohan Reddy
డాక్టర్ భేరి సునీత రామ్మోహన్ రెడ్డి గారు తెలుగు,సంస్కృతం, ఇంగ్లీష్, ఎకనామిక్స్, ఆస్ట్రాలజీ లలో M.A. చేశారు. బీఈడీ చేశారు, పీహెచ్డీ డిగ్రీ తీసుకున్నారు. ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేసిన వీరి సాహిత్య అభిలాష అమోఘమైనది. వక్తగా రచయితగా ప్రవచనకర్తగా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక దేవాలయాలలో సాహిత్య సభల్లో ఉపన్యాసాలు ఇస్తుంటారు. వివిధ సంస్థలకు సభాధ్యక్షురాలుగా అనేక పర్యాయాలు సమర్థవంతంగా సభా నిర్వహణ చేశారు. దివ్యజ్ఞానికేతన్ పాఠశాల వ్యవస్థాపకురాలు, విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షురాలు, జాతీయ సాహిత్య పరిషత్ కోశాధికారి, సెన్సార్ బోర్డ్ మెంబర్, తెలంగాణ రాష్ట్ర పాఠశాల యాజమాన్య సంఘం సలహాదారులు గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. "తెలుగులో స్వాతంత్ర్యానంతర భక్తి పత్రికలు" అనే గ్రంథాన్ని రచించారు. "తమ సోమ జ్యోతిర్గమయా" వ్యాస సంపుటి," మన నదులు పుష్కరాలు" ప్రత్యేక పుస్తకం ,"దేవాలయాలు సంస్కార ప్రాకారాలు "పరిశోధనా గ్రంథం రచించారు. జీవిత చరిత్రలు, శతకాలు రచించారు.4 కవితా సంపుటులు ప్రచురించారు. "కృష్ణవేణి అంతరంగము" దీర్ఘ కవిత "వినవమ్మ విన్నపాలు" గీతిక నూ రచించారు.