రూపు కట్టిన
కొంచెం భావాల గింజలను
అక్షర నాట్లుగా మలిచి
దుమ్ము పట్టిన కాగితంపై
నాటుతున్నాను!
ఎక్కడికి వెళుతున్నావంటే?
ఏమని చెప్పను?
విశాఖ సముద్ర తీరంలో
తరంగాల సోయగాలను
కలం గుండెలో నింపి
కవితా శిల్పం కోసం
వెతుకుతున్నాను!
ఎక్కడున్నావంటే
ఏమని చెప్పను?
జ్ఞాన చక్షువుల గుమ్మం దగ్గర
కవి సమయం ఎగిరిపోకుండా
కలం రెక్కలు అడ్డుపెట్టి
తిష్ఠవేసి కూర్చున్నాను!
ఎలా వున్నావంటే
ఏమని చెప్పను?
హృదయం గుప్పెట్లో
మూసివున్న ఆత్మకథ పేజీలను
రోజుకొకటి చొప్పున
ఆత్రంగా చదువుతున్నాను!
ఇంతే నేను చేసిది.
. . . . .