ఎవరి తల్లిదండ్రులయితేనేం…?

డా.నీలం స్వాతి, చిన్న చెరుకూరు గ్రామం, నెల్లూరు. 6302811961

సడన్ గా కలవాలన్న ఈ ప్లాన్ ఏంటీ, ఏమైనా గుడ్ న్యూస్ వుందా అని అడిగింది వర్ష నవ్వుతూ. గుడ్ న్యూసా పాడా ఇంట్లో ఒకటే గొడవలు బయట వస్తే  కాస్త రిలాక్స్ అవుదామని మిమ్మల్ని రమ్మని పిలిచాను అంటూ పక్కనే ఉన్న చైర్ లాక్కుని
కూర్చుంది ప్రియ. గొడవలా ఎందుకు అంటూ ఆరా తీయడం మొదలు పెట్టింది రమ్య. చెప్తాలే కానీ ముందు తినడానికి ఏదైనా ఆర్డర్ చెయ్ ఆకలిగా ఉంది పొద్దున్న కూడా ఏమీ తినలేదు అంటూ ప్రియ చెప్పగానే స్మైలీ, ఫుడ్ ఆర్డర్ చేసింది. ఫుడ్ కాస్త తిన్నాక డిస్కషన్ మొదలైంది రీసెంట్ గానే కదా మ్యారేజ్ అయింది అప్పుడే గొడవలు ఏంటి అంటూ అడగగానే నీకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా, మ్యారేజ్ అయ్యి అత్తవారి ఇంటికి వెళ్లాక తెలుస్తుంది నేను పడుతున్న కష్టం ఏంటో అంది ప్రియ వర్ష వైపు చూస్తూ.
అసలు సంగతి ఏంటో చెప్పు విసిగించకుండా అని రమ్య అనగానే రోజూ గొడవలేనే మా అత్త మామలకు టిఫిన్ చేయలేదని, వంట చేయలేదని, వండాక వడ్డించలేదని, స్నానానికి నీళ్లు ఏర్పాటు చేయలేదని, టైం కి మందులు ఇవ్వలేదని ఇలా మా వారికి నాకు ప్రతిరోజు గొడవే. అసలు నేనెందుకు చేయాలే ఇవ్వన్నీ, నాకేమంత కర్మ చెప్పు నువ్వే. మా అమ్మ నాన్న దగ్గర ఎంత గారాబంగా పెరిగానో మీకు తెలుసు కదా.
నాకు ఒక్క పని కూడా చెప్పకుండా అమ్మే చేసుకునేది. ఇక్కడ అన్నీ నేనే చేసిపెట్టాలి. రోజంతా పనులతోనే సరిపోతుంది. నాకు మా వారికి కాస్తంత ప్రైవసీ కూడా లేకుండా పోయింది. అందుకే రాత్రి గౌతమ్ కి చెప్పేశాను మనం వేరు కాపురం పెడుదామని. దాంతో రాత్రంతా పెద్ద కురుక్షేత్రమే నడిచింది మా ఇద్దరి మధ్య. ఇప్పుడు మీరు చెప్పండే నేను అడిగింది తప్పా అనగానే అందులో తప్పేముంది వేరుగా వెళితే అప్పుడు మీ ఇద్దరే కనుక గొడవలు తగ్గుతాయి కదా అంది స్మైలీ. నువ్వు ఊరుకోవే, అది ఏది చెపితే దానిని సమర్ధిస్తావు. వేరు కాపురం పెడితే సమస్యలు సర్దు మణుగుతాయా? అసలు గౌతమ్ పేరెంట్స్ తో నీకు ప్రాబ్లెమ్ ఏంటే….? నరకం చూస్తున్నానే రోజూ నేను అంటూ సహనాన్ని కోల్పోయినట్లుగా మాట్లాడింది ప్రియా. అయినా పెళ్లి అయ్యాక నేను మా తల్లిదండ్రులని నా ఇంటిని వదిలిపెట్టి వచ్చానుగా తను మాత్రం తన తల్లిదండ్రులని వదిలిపెట్టి రాలేడా?
అన్ని త్యాగాలు నేనే చేయాలా, తను మాత్రం తన తల్లిదండ్రులతో కలిసే ఉండాలా? నేను మాత్రం వాళ్ళ ఇంట్లో పని మనిషిలా బతకాలా అంటూ ఎదురు ప్రశ్నించడం మొదలు పెట్టింది దాంతో వర్ష చొరవ తీసుకొని, అయినా వాళ్ల తల్లిదండ్రులు అయితేనేనా ఈ పట్టింపులన్నీ అదే నీ తల్లిదండ్రులు అయితే నువ్వు గుండెల్లో పెట్టికొని చూసుకోవా ఏంటి. అసలు అత్త మామల్ని చూడడం అనేది భారం కాదు అది నీ భాధ్యత.
అంతే కాని వేరు కాపురం పెట్టి
సంతోషాన్ని పొందాలని చూస్తే
పెళ్లి అయిన తర్వాత నీ తల్లిదండ్రులకు దూరమై నువ్వు ఎంత బాధ పడుతున్నావో అదే బాధ నీ భర్త కూడా అనుభవించవలసి వస్తుంది. నీ భర్త బాధ పడుతుంటే నువ్వు చూడగలవా చెప్పు. అందుకే ఎవరి తల్లిదండ్రులైనా ఒక్కటే.
సంస్కృతీ సంప్రదాయాల పేరుతో ఆడపిల్లలైతే తల్లిదండ్రులకు దూరమవ్వాల్సిందే, కనీసం కొడుకులని ఈ సంతోషాన్నైనా పొందనిద్దాం అన్న వర్ష మాటలను సమర్థిస్తూ స్మైలీ కూడా మన మైండ్ సెట్ ని మార్చుకుంటే మనతో పాటు
మన కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించు అంటూ ప్రియకు నచ్చ చెప్పారు అందరూ కలిసి.దానితో
మాములు స్థితికి వచ్చింది ప్రియ.

Written by Dr.Neelam Swathi

చిన్న చెరుకూరు గ్రామం,
నెల్లూరు.
6302811961.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తొలి మహిళా కార్టూనిస్టు

ధనం మూలం ఇదం జగత్