తెలుగు భాష కు ఆదరం తగ్గిపోతున్న ఈరోజుల్లో సంస్కృత తెలుగు భాషలకై తనవంతు సేవ చేస్తూ ప్రచారం చేస్తున్న విదుషీమణి విజయశ్రీ గారి మాటల్లో తెలుసుకుందాం.”నేను కోఠీ కాలేజీ లో డిగ్రీ లో సంస్కృతాంధ్రాల్లో మొదటి స్థానం పొందాను.జ్యోతిష్యంలో ఎం.ఎ.చేశాను.సంస్కృత సాహిత్యంలో హాస్యరసం గూర్చి పి.హెచ్.డి.చేశాను.గోల్డ్ మెడల్ పొందాను.విశిష్ట మహిళా పురస్కారం కవితల్లో బహుమతులు పొందాను.కలహభోజనం హాస్య కళాసమితి వారి ఉత్తమ కథా బహుమతి పొందాను.
1978నుండి ఉస్మానియా యూనివర్సిటీ లో సంస్కృత అధ్యాపకురాలిగా పనిచేశాను.దూరదర్శన్ రేడియో లో ప్రోగ్రాం లు ఇచ్చాను.దేశవిదేశాల్లోసంస్కృతభాషా ప్రచారం భారతీయ సంస్కృతి ప్రచారం నాలక్ష్యం.
అవధానాల్లో పృచ్ఛకురాలిగాఅనుభవం ఉంది.30పైగా కాలేజీల్లో సంస్కృతసాహిత్యంపై ప్రసంగించాను.జాతీయ అంతర్జాతీయ సదస్సు ల్లో 40పత్రాలు సమర్పించాను.20ఏళ్లు పరిశోధకులకు మార్గదర్శి గా ఉండి రిటైరైనాను.మూసీ ధన్వంతరి శ్రీ పీఠం లో వ్యాసాలు రాస్తున్నాను.సుమన్ టి.వి.లో ప్రసంగాలు యూట్యూబ్ లో విడుదలైనాయి.
ఇక నాతల్లి దండ్రులు కీ.శే.ప్రభావతి మహాకాళి వేంకట రావుగారు (ఎ.జి.ఆఫీస్ లో ఆడిట్ ఆఫీసర్).నాభర్త శ్రీకుప్పా వేంకటేశ్వర శాస్త్రి గారు ఎల్.ఐ.సి.లో చేసి రిటైర్ అయ్యారు.మా ఇద్దరు అమ్మాయిలు వివాహాలై స్థిరపడ్డారు.నవ్వడం నవ్వించడం నాకు ఇష్టం “
ఫోన్ నెంబర్ 6304179385