నక్షత్ర బంధము
తేటగీతి (పంచపాది) రత్ననిధి దాపునన్ యంబరమున వేగి
రమ్ములేక నిలిచి చుక్క రమ్యదివిన
రత్నముదెస విరాజిల్లి రయముగాను
రశ్మితో నింగివీడెను రహిగ చుక్క
రక్తితో పిలిచితి చుక్క రమ్ము యనుచు.
ఉమ్మెత్త పుష్పబంధము
కందము భస్మాంగ భక్త వత్సల
భస్మాంగ మసనము వాస భస్మాంగ వరా
భస్మాంగ శరణు వేడెద
భస్మాంగ దయగొను దేవ భస్మాంగ శివా.
కృష్ణనింబ పత్రబంధము
ఆటవెలది పదము
పరిప్రియ = లక్ష్మీదేవి
హరిత పాదపముల హరిత వర్ణముగల
రివల పరిమళాలు రివ్వుమనుచు
ప్రియముతోనుజేరి ప్రియల వంటకములో
య కరివేపగాను యలరుచుండు.