మన మహిళా మణులు

శ్రీమతి కోడూరు సుమన
కలంపేరు సుమనశ్రీ! ఎం.ఎ.హిందీ బి.ఎస్సీ. పి.జి.డిప్లమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ జర్నలిజం కూచిపూడి లో ఎం.ఎ.చేశారు. కథ పద్యం శతకం కవిత వ్యాస విమర్శలు రేడియో నాటికలు నృత్యరూపకాలు అవధాని ప్రక్రియ బ్రహ్మోత్సవాల్లో వ్యాఖ్యానాలు..ఇలా సర్వరంగాల్లో ప్రవీణురాలు.లలిత విష్ణు సహస్రనామాలు తెలుగు లో అనువదించారు.
చర్చా వేదికల్లో పాల్గొన్నారు.ఆకాశవాణి కడప తిరుపతి కేంద్రాల్లో ఈమె రచనలు ప్రసారం ఐనాయి.. వివిధ పత్రికల్లో బహు మతులు పొందారు.
ముఖ్యం పురస్కారాలు.. కేంద్ర సాహిత్య అకాడమీ ఢిల్లీ మద్రాస్ తెలుగు యూనివర్సిటీ ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా ఓపెద్ద లిస్ట్ లో కొన్ని ఇవి!
నాట్యం లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లింకా బుక్ ‌.నటరాజపురస్కారం స్టేట్ బెస్ట్ సిటిజెన్ ఇన్ డాన్స్ ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.ప్రస్తుతం అనాధాశ్రమంలో పిల్లల కి డాన్స్ నేర్పుతున్నారు.ఈమె ఫోన్ 9490401968.ఆమె జీవితంలో ముఖ్యమైన విషయాలు తరుణి తో ఇలా పంచుకున్నారు.ఆమెమాటల్లో”

నెల్లూరుజిల్లా నాయుడుపేట లో…64లో పెళ్లయిన పదేళ్లకు ఇక సంతానయోగం లేదని నిరాశగ ఉన్న రంగాచార్యులు రంగనాయకి దంపతులకు…కూతురు పుట్టింది….తాత అమ్మమ్మ ల ఇంట అనమాట. వేదాల వారింటి ఆడబడుచు గ నాట్యం నేర్చుకున్నప్పటికీ ఆనాటి కాలపరిస్థితుల అనుసరించి ప్రదర్శనలు ఇవ్వలేని మాఅమ్మ రంగనాయకమ్మ అపురూపంగ పెంచుతూ నాట్యాన్ని ఉగ్గు గాపోసేసినట్టుఃది. నాట్యం మీదచాలా ఆసక్తి తో పెరిగాను.రైల్వే ఉద్యోగి గా నాన్న గారు కడప జిల్లా నందలూరు కు చేరుకున్నారు ఐదునెలల పసి కందునైన నాతో అమ్మ అమ్మమ్మ తాతయ్య లు ఆఊరే చేరుకున్నారు తాతయ్య ప్రాణాధికంగ నను చూసుకుంటూనే భగవద్గీత సహస్రనామం ముకుందమాల వంటి ఎన్నో స్త్రోత్రాలు అష్టోత్తరాలు నేర్పేవారు అమ్మమ్మ సంగీతం నేర్పితే అమ్మనాట్యం ఇలా ఆటపాటల మధ్య అలవోకగ ఐదేళ్లు వచ్చేశాయి తిరుమలలో ఉత్సవాలకు కుటుంబం తరలి వెళ్లాం అక్కడ పెద్ద జీయంగార్ ఏవో యజ్ణ్నాలు జరుపుతున్నారు సాయంత్ర వేళ మైకులో వివిధ కీర్తనలు వింటూ చెల్లెళ్లతో ఆడుకుంటూ ఉన్న నాకు..నీలమేఘ శ్శారీరా….అంటూ కృష్ణతరంగం వినిపించేసరికి నర్తించాను. అందరు చూశారు జియ్యంగార్ నను చెంతకుపిలిచి ఒక వెంకటేశ్వరస్వామి రూపు నాకు ఇచ్చి ఆశీర్వదిఃచారు అదే ఆరంగేట్రం అదే తొలిబహుమానం అయ్యేంత విలువైన అపురూపమైన అనుభవం. మాఊరుచేరాక ఏ చిన్న వేడుక జరిగినా నానాట్యప్రదర్శన ఉండాల్సిందే రైల్వేకళాసమితి చాలా చురుకుగా ఏడాదిలో నాలుగు మార్లు సాంస్కృతికంగా కొర్యక్రమాలు క్రీడలు నాటకోత్సవాలూ జరీపేవారు అన్నింటా నేను ఉండటం అనేది చాలా ముఖ్యమైపోయింది ఆఊరిలో తొలి క్లాసికల్ నర్తకిని నేనే. రైల్వేతరఫున జోనల్ కేంద్ర కార్యక్రమాలలో కూడాపాల్గొంటూ గుంతకల్,హుబ్లీ రేణిగుంట…ఢిల్లీ వరకూ నా నాట్యప్రదర్శనలు అప్రతిహతంగ కొనసాగాయి. రైల్వే స్కౌట్స్, ద్వారా..నేనుచదువుకున్న జిల్లాపరిషత్ పాఠశాలద్వారా కూడా అత్యధికంగ ప్రదర్శనావకాశాలు లభించేవి తిరునతి శోభాకళాపరిషత్…తితిదే కార్యక్రమాలు నాకుమరిన్ని అవకాశాలందించేవి. చదువులో ప్రధమశ్రేణి లో కొనసాగుతు పాట అంటే నాట్యం అంటే…సుమన అనే పేరుతెచ్చుకూన్నాను చిన్నతనంనుంచి పాప్యులర్ నెలకు బహుమతులిచ్చిన ప్రముఖులు…మహాగురునటరాజరామకృష్ణగారు, వెంపటి పెదసత్యం గారు, గాయని ఎస్ జానకి, ఎస్పీ బాలసుబ్రమణ్యం,అప్పటిజి సుప్రీంకోర్టు సి.జె.వైవి చంద్రచూడ్, నటులు రాజనాల, కేవీచలం, అంజలీ దేవి గారి వంటి మహామహులున్నారు.‌ ఇప్పటి లా ఛానల్స్ లేవు కాబట్టి అవన్నీ అద్భుతజ్ణ్నాపకాలుగా కొన్ని ఫోటోలుగ మిగిలాయి. పాఠశాలవిద్యానంతరం తిరుపతి లో చదువుకు చేరటం వలన అక్కడ సాళ్వ సూరిబాబుగారు
ఆరవీటి ప్రభావతి (ఎస్వీ సంగీతనృత్య కళాశాల) గారు..పద్మశ్రీ కోరాడనరసింహారావు గారివద్ద నాట్యశిక్షణ కొనసాగించాను. నాన్న గారికి గుంటకల్ బదిలీ జరిగింది నేను తిరుపతిలో చదువుతూ సెలవులనిమిత్తం ఇంటికి వెళ్లినపుడు మహాశివరాత్రి నాడు గుంతకల్ శివాలయం లో సాయంత్రం 6:30 నుంచి మరునాటిఉదయం వరకు నాట్యంప్రదర్శించాను అది రికార్డని ఆతర్వాత తెలిసింది ఆలయయాజమాన్యం ద్వారా పేపర్లద్వారా ఈవిషయం తెలిసి నాకులిమ్కా అవార్డ్ ఇచ్చి నమోదు చేస్తామని చెప్పారు. పద్మావతి కాలేజీ లో నాచదువు కొనసాగిస్తునే అనేక నృత్యరూపకాలలో పాల్గొన్నాను ఒక ప్రదర్శనకుఅతిధి గావచ్చిన పద్మశ్రీ శోభానాయుడు నను ప్రత్యేకంగ అభినందించటం జీవితంలో మరో మరపురాని జ్ణ్నాపిక ఆమె నా అభిమాన నర్తకి ఆరాధ్యనర్తకీమణి.‌..చదువు సగంలో ఉండగనే ప్రేమవివాహం. కానీమా అత్తవారింట నాట్యంఅంటే ఒక నేరం లా భావించటం నను చాల కృంగదీసింది జీవితంలో ఎన్నో మార్పులు ఇద్దరు అమ్మాయిలు మావారిని బ్రతిమాలి చదువు (డిగ్రీBSC) పూర్తిచేసూకున్న పిజీ వెళ్లేందుకు అనుమతి లేదు నాకు నాట్యం దూరమౌతోందనే బాధ అధికమవుతుంటే నాబిడ్డలకు నేర్పించే మిషతో ఇరుగుపోరుగు పిల్లలకు నేర్పటం మొదలెట్టాను మా బిడ్డలు కడప లో కేంద్రీయవిద్యాలయ లో చదివేవారు అక్కడ సంగీతం నృత్యం కూడా క్లాసులుండటంతో నాపని సులువైంది మళ్లీ నెమ్మదిగ బిడ్డలచేత ప్రదర్శనలు వీ చేయిస్తూ నాట్యానికి దగ్గరయ్యాను ఎంఏ పరీక్షలు కట్టాను ఎంఏ హిందీ పూర్తయింది. మావారికి చంద్రగిరి బదిలీ(జూనియర్ కాలేజీ లెక్చెరర్) మళ్లీ తిరుపతీ చేరటం తోనాకళలకు చదువుకూ తిరిగి అవకాశం వచ్చింది అప్పుడే ఎస్వీబీసీ ఏర్పడటం తో అక్కడ స్క్రిప్ట్స్ వ్రాస్థూ బ్రహ్మోత్సవాలలో నాట్యం ప్రదర్శన లు చేస్తూ…అక్కడి ఉద్యోగం పర్మినెంట్ కోసం ఎంఏ జర్నలిజం చేశాను తర్వాత నాకెంతో ప్రాణమైఐన నాట్యంలో ఎంఏ చేయటం పిహెచ్డీ..చేయడం.8ఏళ్లుపట్టింది డాక్టరేట్ సాధించేందుకు….ఇలా ఎన్నో ప్రతిబంధకాలు,నిరసనలు ఎదుర్కుంటూ నాసాహితీప్రయాణం నాట్యప్రస్థానం కొనసాగిస్తునే ఉన్నాను ఉమ్మడి కుటుంబంలో పెద్దకోడలుగ అధిక బరువు బాధ్యతలు ఉండేవి నాసంకలచపశక్తిని కోల్పోకుండా నిరాశనిస్పృహలకు గురైనా ఎపుడూ నా నాట్యాన్ని వదలాలనుకోలేదు ఈక్రమంలో ఆరావళి అనిపేరిట వీధి బాలల పాఠశాలలో ,తిరుపతి లోనిప్రభుత్వ ప్రభుత్వేతర అనాధశరణాలయాలలో అంధబధిర పాఠశాలలో నాట్యబోధన ఉచితం గ చేస్తూ వారిలో చైతన్యం వారికీ పేరు తెచ్చేందుకు వివిధ వేదికలమీద వారిచేత ప్రదర్శనలు చేయించేదాన్ని ప్రపంచ తెలుగుమహాసభలు,‌ముంబైతెలుగువెలూగులు, తమిళనాడు తెలుగుఉత్సవాలలో ఈఅనాధలచే ప్రదర్శనలుచేయించి నాటి ప్రభుత్వంచే ప్రశంసలు అందుకున్నాను ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ సంగీతనృత్య అకాడెమీ లో నియమించబడ్డాను. నాట్యసాహిత్య లు రెండుకళ్లు గా కొనసాగుతున్న జీవితంలో కోవిడ్ పెద్ద కుదుపు తెచ్చింది రెండవ వేవ్ లో నాభర్త కనుమూశారు నేను దాదాపు ఒకటిన్నర నెల రోజులు మృత్యువుతో పోరాడి బతికాను ఈ పెను విషాదం నుంచి ఇంకా బైట పడలేనందువలన నా నాట్యాలయాన్ని ఇంకా ప్రారంభించలేదు సాహితీ కార్యక్రమాలు ఇపుడిపుడే మొదలు పెట్టాను. ఇక మిగిలిన వివరాలు నిన్నపంపినవే….అదండీ కథ.


కళాతపస్వి పద్మశ్రీ,పద్మభూషణ్ డా.కె.విశ్వనాధ్ గారి గురించి నేనువ్రాసిన సామవేదం లోసామాజిక స్పృహ*….అను పుస్తకం తొలికాపీ విశ్వనాధుని పాదాలవద్ద 2-6-22‌న, తర్వాత చెన్నై ఆంధ్రమహిళాసభలో ఘనంగ ఆవిష్కరించుకున్నాను
ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ప్రముఖ నటులు శరత్ బాబు గారు, నాట్యరంగం నుంచి వేదాంతం రాధేశ్యాం గురువుగారు, సంగీతచక్రకర్త శ్రీయుతులు లేళ్లపల్లి రమేష్ గారు,బాలసుబ్రమణ్యం సోదరిమణులు వసంత,పార్వతి, ప్రముఖ సాహితీవేత్త మాడభూషి సంపత్ కుమార్ గారు విచ్చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కళాతరుణి

శూన్యం