హరిత తోరణం

గతవారం ఎరుపు రంగు గురించి చెప్పుకున్నాం కదా ! ఈ వారం హరివిల్లులో కనిపించి,  కనువిందు చేసే హరిత వర్ణం గురించి కాసిన్ని  కబుర్లు .   ఈ రంగు ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది  .చేతన ,సుషుప్తి  అవస్థలకు వారధి . ఆజ్ఞా చక్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది . ఇది ప్రేమను అందించే , అందుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్న రంగు .

ఈ రంగును ఇష్టపడే వ్యక్తులు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు  .ఊహల్లో తేలి ఆడడం వీరికి నచ్చని పని  .మనసులో ఒకటి పెట్టుకొని  ,బయటికి మరోలా మాట్లాడడం వీరికి రాదు . నచ్చని విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తారు  .వాదించడం వీరికి నచ్చదు  . రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు  .ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా తొందరగా అమలుకు సాధ్యమైన నిర్ణయాలని తీసుకుంటారు  .సున్నిత స్వభావం , ఆశావాద దృక్పథంతో స్నేహశీలిగా ఉంటారు  .ముక్కు సూటిదనం వీరి సొంతం  .ఏ రకమైన చికిత్సలోనైనా ఆకుపచ్చరంగు  తోనే మొదలెట్టి  ఆకుపచ్చ తో ముగిస్తారు  .చాలా క్షేమకరమైన రంగు . ప్రాణ శక్తిని క్రమబద్ధ పరిచే రంగు.

పొందికకు ఆరోగ్యానికి గుత్తైన రంగు  .విశ్రాంతినిచ్చే రంగు  .మనసును , శరీరాన్ని స్వస్థత పరుస్తుంది . మన ఆవేశాలను సంతులన పరిచి సురక్షిత స్థితిలో ఉండేలా చేస్తుంది. ఆశలు కలిగిస్తుంది  .నరాలను  ,కండరాలను చురుకుగా ఉంచుతుంది . ప్రజ్ఞకు సంతోషానికి , ఉల్లాసానికి గుర్తు  .అంతేనా రక్తాన్ని శుద్ధి పరుస్తుంది . శరీరంలోని ఫారిన్ కణాలను తొలగేలా చేస్తుంది. వాత తత్వమున్న వారిలో వ్యాధులను త్వరగా తగ్గిస్తుంది . కళ్ళకు చాలా మంచిది  .కంటి చూపును  మెరుగుపరిచే రంగిది  .అందుకే డాక్టర్లు రోజూ కాసేపు  పచ్చికను , పొలాలను చూడమంటారు  . నవ శకానికి సంతోషానికి గుర్తు  . ట్రాఫిక్ లైట్లలో ముందుకెళ్లడానికి ఇదే మార్గదర్శి ప్రకృతికి ప్రతీక  .సృష్టికి ప్రతిరూపం .

హరిద్ర కాంతులు

పసుపు పచ్చ ,  ఆకుపచ్చ  జంట కవుల లాంటివి  . ఒకదాన్ని తలుచుకోగానేమరొకటి  గుర్తుకొస్తుంది . పసుపు అనగానే మనకు పండుగలు పర్వాలు  ,శుభకార్యాలు కళ్ళ ముందు కదలాడుతాయి  .ఆనందానికి  ,ఉత్సాహానికి చిరునామా ఈ రంగు . సంతోషానికి  ,ఆశావాదానికి ప్రతీక . మెదడులోని తర్కబద్ధ ప్రాంతానికి చెందింది కనుక త్వరగా ఏవైనా నేర్చుకునేలా చేస్తుంది. ఆలోచనలను  ప్రేరేపిస్తుంది  .ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

నరాలను , కండరాలను చురుకుగా ఉంచుతుంది . నిర్జీవ కణాలలోని మృత కణాలను క్రియాత్మకం చేస్తుంది . ఈ రంగులో నాడీ వ్యవస్థను , మెదడును చురుకుగా ఉంచే శక్తి ఉంది  .ప్రజ్ఞకు  ,తత్వశాస్త్రాభివృద్ధికి చెందిన గుర్తు

ఇక ఈ రంగును ఇష్టపడే వారి గురించి చెప్పడానికి చాలానే ఉంది .వీ రు ఆహ్లాదంగా  ,చురుకైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు .వ్యాపార దక్షత కూడా ఎక్కువే . కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు . అందరిలా ఉండడం కన్నా తానో ప్రత్యేకమైన వ్యక్తిని అనిపించుకోవాలనుకోవడం వీరికి చాలా ఇష్టం . ప్రతి విషయాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటారు . చాలామంది స్నేహితులు ఉంటారు  .కొన్నిసార్లు త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు . ఇది కొన్ని సందర్భాల్లో చిక్కుల్లో పడేసే అవకాశాలు ఉన్నాయి . ఈ రంగును ఇష్టపడే వ్యక్తులు చూడటానికి మోడ్రన్ గా కనిపించినా  ,వీరికి పాతకాలపు ట్రెండ్స్ అంటేనే ఎక్కువ ఇష్టం  .ఎలాంటి సందర్భాన్ని అయినా తేలికగా హ్యాండిల్ చేయడం వీరి  ప్రత్యేకత .

చాలా ఎమోషనల్ వీరు కానీ ఏ ఫీలింగ్ బయటికి కనపడనివ్వరు  .త్వరగా నిర్ణయాలు మార్చుకోవడం వీరి లో ఉండే నెగటివ్ పాయింట్  .సమస్యలు ఎన్ని ఉన్నా సంఘర్షణలెన్న మనసుంటేనే మార్గం ఉంటుందన్నది పసుపు రంగు చెప్పే మార్గం  .శుభకరి . శోభస్కరి . మంగళకరి అయిన ఈ పసుపు లేనిదే ఏ వంటిల్లు సమగ్రం కాదు . ఏ శుభకార్యము ముందుకు సాగదు  .

ఈ వ్యాసంలో రేఖామాత్రంగా ఆకుపచ్చ పసుపుపచ్చ రంగుల లక్షణాలను గురించి చెప్పుకున్నాము  . మరో రెండు రంగుల గురించి వచ్చేవారం వరకు ఎదురు చూడాల్సిందే .

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కేయూర చిత్రాలు

నృత్యం