అమ్మ లానే పరమాత్మ సర్వాంతర్యామి

అదేంటి ? అమ్మ పరమాత్మ కంటే గొప్ప నా? అని అనుకుంటున్నారా?
మరే ఆ పరమాత్మ ను కన్నది కూడా అమ్మ నే కదా! అందుకే!
అమ్మ గురించి న ఓ సినిమా పాటకూ పరమాత్మ విషయానికీ పోలిక ఏంటో చూద్దాం…
అమ్మా…పువ్వులో ..గువ్వలో.వాగులో తీగలో..అంతట నీవేనమ్మా..అన్ని నీవేనమ్మా .నీవొడిలో నన్ను దాచు కోవమ్మా.,నీపాపలా నన్ను చూచుకోవమ్మా…నీచల్లని నీడే నాఇల్లు..ఈమూగ జీవులే నావాళ్ళు,అంతు లేని నీ అందాల లోకం అంతా నాదే నమ్మా.అమ్మా….అనే ఈ భావాన్ని
భాగవతంలో ప్రహ్లాదునితో పోతన గారు కూడ ఇలానే చెప్పించారు కదా! “కల(డంభోదిగలండు గాలి గలడాకాశంబునంగుంభినిం గలడగ్నిన్ దిశలం బగళ్ళని శలన్ ఖద్యోతచంద్రాత్మలం గ లడోంకారమునం ద్రిమూర్తులం ద్రిలింగ వ్యక్తులం దంతటం గలడీశుండు గలండు తండ్రి వెదుకంగా నేల నీ యా యెడన్ “.
అమ్మ- పరమాత్మ ఇద్దరూ అంతటా ఉంటారు . లాలన అనేది ఇద్దరి తత్వం అని పైన ఉన్న బొమ్మ ను చూస్తే అనిపిస్తోంది కదూ! అమ్మాయి గుణం లోనూ ఆర్థ్రత కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది కదూ!!

పల్లవి: పువ్వులో గువ్వలో వాగులో తీగలో అంతట నీవేనమ్మా అన్నిట నీవేనమ్మా నీవొడిలో నన్ను దాచుకోవమ్మా నీపాపగా నన్ను చూసుకోవమ్మా సినిమా పేరు : ఇద్దరు అమ్మాయిలు. ఈ పాట కు ఇలా వ్యాఖ్యానించాలని అనిపించింది. ఈ
బొమ్మ లను నేనే వేసాను చూడండి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిశ్శబ్ద ఝరి

కేయూర చిత్రాలు