కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను గుత్తిగా కట్టి వెలిగిస్తారు కదా!!! అలా వెలిగించడం వెనుక కారణం ….
మనము ఇంట్లో నిత్య దీపారాధన చేసే క్రమంలో ఎప్పుడైనా అవాంతరాలు వచ్చినప్పుడు కానీ …ఇల్లు విడిచి ఎక్కడికైనా వెళ్లాల్సిన సందర్భం వచ్చినప్పుడు కానీ తప్పకుండా పూజా మందిరంలో దీపం వెలిగించటానికి ఏర్పాటు చేసి వెళ్ళాలి కానీ ….ఆ వెసులుబాటు లేనప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చే కార్తీక పౌర్ణమి రోజు 365 రోజులకు కాను 365 వత్తులను ఒక కట్టగా కట్టి గుత్తి దీపాన్ని వెలిగించినట్లయితే…. మనం అనివార్య కారణముల వలన పూజా మందిరంలో దీపము వెలిగించని దోషము నివారణ అవుతుంది .అందువలన కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు 365 వత్తులను వెలిగించవలెను.
సర్వేజనా సుఖినోభవంతు