అలసి పోయాను జీవిత గమనంలో
బాల్యం బహు సుందరం..
ఆస్వాదించే లోపల ఆవిరయ్యింది..
కౌమార దశ కఠినమైనది..
మార్పులను స్వాగతిస్తూ..
రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ..
ఆచి తూచి అడుగులు వేస్తూ ఆనందాలను అణచి వేసుకోవడమే
యవ్వనం కీలకమైనది..
వయసు హోరును..
మనసు పోరును నియంత్రించి..
జీవితాన్ని అందంగా తీర్చి దిద్దు కోవడం…
అన్నీ ఇలా వచ్చి అలా పోతే..
చివరి మజిలీ..
చేతులు చాచి ఆహ్వానించిన వృద్ధాప్యం..
కాల పరిమితి లేనే లేదు..
ఎన్నేళ్ళు బ్రతుకుతామో తెలియదు..
ఎన్ని దశలు చూడాలో అవగాహన లేదు..
బ్రతుకు వెళ్ళదీయడమే..
సుఖ మరణం ఈయమని కోరుతూ..
సద్గతులు కలగాలని ప్రార్థిస్తూ ప్రశాంతంగా గడపడం