33% ముందడుగు – A step to sucsess

24-9-2023 తరుణి పత్రిక సంపాదకీయం

ఎప్పుడైతే జాతి సంస్కృతి ని గౌరవిస్తామో అప్పుడే తరగని సంపద కలిగిన వారిమవుతాము. ఈ సంపాదనే ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది. ధైర్యంగా నిలబడే స్ఫూర్తి నీ ఇస్తుంది. మనిషి అనే మాట లో దాగిన ‘ షి‘ ని తక్కువచేసి, ‘ మని‘ వెంట పడిన పురుష జాతి, అధికారం చెలాయిస్తూ ఆమె కు పరిపాలనాధికారానికి దూరం చేసింది. ఒకప్పుడు మాతృస్వామిక పాలనా వ్యవస్థ, పరిస్థితులు ఉండేవి . క్రమంగా స్త్రీలు ఉత్పత్తి సాధనాలుగా తయారు అయ్యారు .
1 వంటావార్పు చేయటం 2. పిల్లలను కనిపెంచటం
3. ఇంటెడు చాకిరీ చేయటం . ఈ పనులకు స్త్రీ లను అంకితం చేసి పితృస్వామ్య వ్యవస్థలో ఆమెను కట్టిపడేసారు. ఇంతటితో ఆగారా? లేదు. స్త్రీ అంటే పని యంత్రం లా , వేతనలేని కూలీగా, చేసేసారు. ఇది ఇదీ అని తెలియనంత , తెలుసుకోలేనంత అమాయకత్వం లో పడవేసారు. ఆ మూడు ప్రక్రియ లూ మందికెవరికో చేయడం కాదుకదా తనదైన ఇంటి కుటుంబ సభ్యులకు తన భర్త తన సంతానానికే కదా పనులుచేస్తున్నది అనవచ్చు. ఇవన్నీ బాధ్యత లు , బంధాలతో కూడిన అందమైన పనులు అనవచ్చు. తల్లిగా చెల్లెలి గా అక్కగా, భార్య గా చేయాల్సిన కనీసం బాధ్యత లు అని అన్నప్పుడు, సరే మంచిదే చేయాలి ! చేస్తుంది ! …. కానీ,
ఈ ‘ కానీ‘ ఉందే !?
ప్రేమ ఆప్యాయత అనురాగాలు ముప్పిరిగొని ఆమెని వివశురాలిని చేసే వైనం కాదు ఇది. అధికార అహంభావ వికారాలతో అణగదొక్కారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి స్త్రీలు చేయని కృషి లేదు. కానీ రాజ్యాంగ బద్ధంగా పరిపాలన లో భాగస్వామ్యం లేకుండా ఏమీ సాధించలేరు. ఎందుకంటే పాలక వర్గాల అథారిటీ నే వేరు .
ఇప్పుడు ఈ సందర్భంగా చట్టసభల్లో 33/ రిజర్వేషన్ బిల్లు వచ్చిన చారిత్రక నేపథ్యం లో ఓ చిన్న విశ్లేషణ చేసుకుందాం.
బాగుంది ఎన్నికల్లో నిలిచి, గెలిచి రాజకీయ రంగం లో అధికారం చేపట్టిన తరువాతచైతన్య వంతంగా , ఫలవంతమైన గౌరవప్రదమైన జీవితాన్ని తాను పొందుతూ ఉంటే మంచిదే! ఏ అధికారం లో పదవిని చేపట్టిందో మినిస్టర్ గా ఎమ్ ఎల్ ఏ గా తనదైన అధికారాన్ని తన తోటి స్త్రీ ల కష్టాలు కన్నీళ్లు తన విభాగానికి సంబంధించి నవైనా తోనే నిర్ణయం తీసుకోవాలి. ఊహూ ! అలా జరగడం లేదు!
రిజర్వేషన్ సౌకర్యం తో కలిసిఎన్నికల బరిలో ఆమెను నిలబెట్టి, వెనుక పెత్తనమంతా భర్తగానో కొడుకుగా నో వాళ్లే నడుపుతున్నారు. ఈమె ఒక బరబ్బర్ స్టాంప్ అయిపోతుంది. ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే ఆడవాళ్ళ ఆలోచనా విధానం మారాలి. ఇది భావి తరాలకు తరగని గని లా రాజనీతిజ్ఞుత తెలుసుకొని మహిళలు నాయకులయ్యేలా ప్రేరణవ్వాలి అవుతుంది
Be wise, Be brave, Be tricky
ఇప్పుడు విశాల హృదయం తో ఆలోచనలు చేసి, మహిళాభ్యుదయంతో మానవాళి అభివృద్ధి ని కోరే good politision లుగా సంసుధ్ధులవ్వాలి. ధైర్యంతో అమాండ్ మెంట్స్ తీసుకునేప్పుడు ఎవరి ప్రోద్బలంతో నిర్ణయం తీసుకోవద్దు. సమాజానికి దిక్సూచిగా ఉండగలగాలి. పేదల పాలిట పెన్నిధి గా శిలాక్షరాలు లిఖించాలిె ఇక మూడోదైన ట్రిక్కీ ను బాగా నే నేర్వాలి. ఎక్కడ చీపురుగులు ఉంటే అక్కడ తెలివి అనే మందును పిచికారీ చేయాలి. ఎంత వెనకేసినా సుంతైనా తీసుకుపోలేని చివరి మజిలీ నే ఎవ్వరైనా చేసేసదని గుర్తుచేసుకుంటూ అవినీతిని దరుదాపులకు రానివ్వని ట్రిక్ లు మెళకువలు నేర్చుకుని నిలిచి గెలవాలి రాజకీయాల్లో! అప్పడే మహిళా బిల్లు కు న్యాయం చేసిన వారవుతారు. రాజకీయ రంగం అనే రంగానికి నూతన అధ్యాయాలు లిఖించాలి. పాఠాలు నేర్వాలి పదిమందికి నేర్పాలి.
ఈ ముందగును ఈ కాలపు పిల్లలూ అనుసరిస్తారు. ఆకాశం లోనేకాదు అన్నింటా సగం అవుతూ విజయకేతనాలెగురవేస్తారు. మహిళలు మహరాణులవుతారు.
సక్సెస్ సక్సెస్ సక్సెస్!!!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆడదంటే

ప్రవల్లిక