జగన్మాతవమ్మా ఉయ్యాలో ఓ గౌరిదేవి ఉయ్యాలో
ఆకాశగంగ తో ఉయ్యాలోఅభిషేకమొనరించి ఉయ్యాలో
పసుపుకుంకుమతో ఉయ్యాలో అర్చింతునమ్మా ఉయ్యాలో
పరమేశుని పత్ని ఉయ్యాలో పరమేశ్వరీ దేవి ఉయ్యాలో
పారిజాతాలతో ఉయ్యాలో ప్రేమతో పూజింతు ఉయ్యాలో
రాజేశుని పత్ని ఉయ్యాలో రాజేశ్వరీ దేవి ఉయ్యాలో
జాజీపూలతో జన్మంత పూజింతు ఉయ్యాలో
వీరభద్రుని పత్ని ఉయ్యాలో భద్రకాళీ దేవి ఉయ్యాలో
బంతీపూలతో ఉయ్యాలో భక్తితో పూజింతు ఉయ్యాలో
మల్లిఖార్జున పత్ని ఉయ్యాలో భ్రమరాంబా దేవి ఉయ్యాలో
మందార పూలతో ఉయ్యాలో ముద్దుగా పూజింతు ఉయ్యాలో
శంకరుని పత్ని ఉయ్యాలో శాంకరీ దేవి ఉయ్యాలో
శంకూ పూలతో కోరీ పూజింతు ఉయ్యాలో
విశ్వనాథుని ఉయ్యాలో అన్నపూర్ణా దేవి ఉయ్యాలో
రుద్రుని పత్ని ఉయ్యాలోరుద్రాణి దేవి ఉయ్యాలో
రుద్రాక్షపూలతోఉయ్యాలో రోజూ పూజింతు ఉయ్యాలో.
చేమంతి పూలతో చిత్తంతో పూజింతు ఉయ్యాలో
సుందరేశ పత్ని ఉయ్యాలో మీనాక్షీ దేవి ఉయ్యాలో
తామరపూలతో తప్పక పూజింతు ఉయ్యాలో
ఇకామ్రేశ్వర పత్ని ఉయ్యాలో కామాక్షీ దేవి ఉయ్యాలో
కలువ పూలతో కొలిచెదనమ్మా ఉయ్యాలో
లోకాలనేలే ఉయ్యాలో లలితా దేవి ఉయ్యాలో
కొలిచినవారికి ఉయ్యాలో కొంగు బంగారమై ఉయ్యాలో
నిలిచావు తల్లీ ఉయ్యాలో ఓ జగదాంబ ఉయ్యాలో.