నా తెలుగు విశ్వరూపం

కవిత

ఏమని వర్ణింతు – నా తెలుగు భాషా ప్రతిభాపాటవాలు-
తెలుగు తల్లి నుదుటి మెరిసిన సింధూరమైంది-
తెలుగు తల్లి మనసులో మమకారాల వెల్లువైంది-
తెలుగు భారతి మువ్వల్లో మురిపెంగా నవ్విన రవళైంది-
దేశ భాషలందు తెలుగు లెస్స అని అందరికి అమృతధార అయ్యింది-
అచ్చులతో అల్లికలు నేర్చి – హల్లులతో మాలికలు కూర్చింది-
గుణింతాలతో సుగుణాలు చెక్కి – ద్విత్వాలతో శిల్పాలు మలిచింది –
సంధులతో సంబంధాలు పేర్చి – సమాసాలతో విశేషాలు చెప్పింది –
సంయుక్తాలతో యుక్తులు పన్ని – అలంకారాలతో అందలం ఎక్కింది –
విభక్తులతో ఆకర్షణ చేసి – ప్రత్యయాలతో ప్రతిమ చేసింది –
యతులతో గతులు మార్చి – ప్రాసలతో ప్రతిభ చూపింది –
ఛందస్సులతో ఉషస్సు నింపి – పద్యాలతో కదం తొక్కింది –
అవధానాలతో వేదికలెక్కి – ఆశువుగా ధారణ చేసింది –
నుడికారాలతో వాసికెక్కి – జాతీయాలతో రాశి పెంచింది –
ఏమని వర్ణింతు – నా తెలుగు భాషా ప్రతిభా పాటవం –
సుధురం – సుందరం – సుబోధకరం – తెలుగు అక్షర విశ్వరూపం-

Written by Y.Sujatha Prasad

వై. సుజాత ప్రసాద్,
ఊరు - లచ్చపేట,
జిల్లా సిద్దిపేట,
చరవాణి - 9963169653.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వైద్య పరిజ్ఞానం- ఇంట్లో ఆరోగ్యం –

అక్షర తేజం