సుమధుర మంజుల భాషణం
మనిషికి మణి భూషణం
మర్యాద, విలువ, గౌరవం
గెలిచి నిలిచే సంపత్తి
మాట రెండువైపులా పదునైన కరవాలం
పెదవి దాటిన మాట విల్లు విడిచిన బాణం
కారాదు అది ఎదుటివారి గుండెల్లో గుచ్చే శరం
మాట మనిషి వ్యక్తిత్వానికి,మానసిక స్థితికి కొలమానం
మనం మాట్లాడే ప్రతీ మంచి మాట ఎదుటివారిపై కావాలి తిరుగులేని అస్త్రం
మాట బాగుంటే మిత్రులు, ఆప్తులు
లేకుంటే శత్రువులు
మాట మనిషికి మాత్రమే దేవుడిచ్చిన గొప్ప వరం
చెయ్యరాదు ఎప్పుడూ దానిని నిష్ప్రయోజనం.