వంటింటి కళ

పన్నీర్ బుర్జీ

పన్నీరు 200g
నూనె 40గా
ఉల్లిపాయలు 4పెద్ద సైజువి
టమాట 2మీడియం సైజు
అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 tsp
పసుపు 1/4 tsp
కారం 2and1/2tsp
ఉప్పు 1tsp
ధనియాల పొడి 1/2 tsp
గరం మసాలా పొడి 2చిటికెలు
కొత్తిమీర తరుగు 1/2 కప్పు
ఇది మూకుడులో కానీ, వెడల్పు మందమైన పాత్రలో కానీ వండుకుంటే బాగుంటుంది.
ముందుగా పన్నీరుని ఫ్రిడ్జ్ లో నుండి 1/2గంట బయట పెట్టాలి. తరువాత పన్నీరునిచేతి తోచిన్నగా చిదుముకోవాలి. లేదాసన్నగాతురుముకోవాలి.ముందుగాపాత్ర పెట్టి వేడెక్కాక నూనె వేసి వేడి కాగానే
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి
బంగారు రంగు వచ్ఛే వరకు వేయించాలి.
తర్వాత సగం కొత్తిమీర తరుగు వేసి కాస్త వేయించి, అల్లం వెల్లుల్లి, పసుపు వేసి వేయించి, సన్నగా తరిగిన టమాట ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సగం మంటపై మెత్తగా మగ్గనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసి కలిపి ఒక నిమిషం పూర్తి సిమ్ మంట పై ఉడకనివ్వాలి. తర్వాత ఒక టీ కప్పు నీళ్లు పోసి, మంటని సిమ్ కంటే కాస్త పెద్దగా పెట్టి 5నిముషాలు కూరని మెత్తగా ఉడకనివ్వాలి. సగంనీరు ఇంకినాక పన్నీరు తురుము వేసి కలిపి సిమ్ లో 5నిమిషాలు ఉడికించి ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి 1నిమిషం ఉంచిస్టవ్ కట్టేయాలి. పై నుండి కొత్తిమీర వేసి అలంకరించుకోవాలి. ఇది అన్నంలో కానీ,చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది.

పాముల జ్యోతిర్మయి. హైదరాబాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సోదర సందేశం

మణి భూషణం