మహిళామణులు

శ్రీమతి టి.రాజకళ

ఆమె మెడికల్ షాపులో వచ్చినవారికి డాక్టర్ చీటీ చూసి చకచకా కావాల్సిన మందులు అందిస్తారు.ఎప్పుడు ఎలా మాత్ర వేసుకోవాలి అని చక్కగా ఓపిక గా వివరించి చెప్తారు.ఉదయం రాగానే షాపు ముందు శుభ్రం చేయించి నీరు చల్లించి దేవుని పటాలు ముందు దీపం వెలిగిస్తారు.డాక్టర్ కోసం వచ్చే పేషెంట్లకి కూర్చోమని చెప్పి తన పనిలో నిమగ్నమై పోయే రాజకళ గారు తన చదువు విశేషాలు ఇలా చెప్పారు” నేను జనగాం లో 10వక్లాస్ దాకా తెలుగు మీడియం లో చదివాను.ఇంటర్ కూడా సి.ఇ.సి.గ్రూప్ తో తెలుగు మీడియం లో చదివాను.6గురు అన్నలు ఒక తమ్ముడు.మాపేరెంట్స్ కి ఒకే ఒక్క అమ్మాయిని. ఎలాంటి కష్టం లేకుండా 30మంది ఉన్న ఉమ్మడి కుటుంబం లో బాల్యం హాయిగా గడిచింది.

మాస్కూల్ పేరు వాణీ శిశుమందిర్.కో ఎడ్యుకేషన్ కానీ అందరం సరదాగా ఆడిపాడేవాళ్లం రోజు 4_4.30దాకా సాయంత్రం గేమ్స్ కంపల్సరీ.అబ్బాయిల్తో కల్సి కోకో కబడీ ఆడేవారం.టీచర్లని ఆచార్య ఆచారీజీ (లేడీ టీచర్స్) అని పిలిచేవారం.శ్లోకాలు ఆటపాటలు మంచి విషయాలు అన్నీ బడిలో నేర్చుకున్నాను.ఇంటర్ కాగానే పెళ్లి ఇద్దరు బాబులు
మాచిన్న బాబు కూడా కూకట్పల్లి లో టిఫిన్ సెంటర్ నడుపుతూ వీలైనంత సేపు షాపు వ్యవహారాలు చూస్తాడు.నాకొడుకులిద్దరూ నాకు రెండు కళ్ళు. మాకోడలు ఓకూతురులాగా సాయపడుతుంది అంటున్నారు రాజకళ. అంతేకాదు,
” నా భర్త కీ.శే.శ్రీ రవీంద్ర గారు ట్రైనింగ్ పొంది భరత్నగర్ లో సాయిశ్రీ మెడికల్ షాపు జనరల్ స్టోర్స్ తెరిచారు.మాపెద్ద అన్నయ్య ఇంకా నాసోదరులంతా అండదండగా ఉంటారు.కోవిడ్ మహమ్మారి వలన నా భర్తను దూరం చేసింది.కానీ ధైర్యం తో నేనే షాపు నడపాలని నిశ్చయించాను.పెద్దబాబు డి.ఫార్మసీ చేసి పెళ్లి కూడా ఆయన ఉన్నపుడే కావటంతో ధైర్యం తెచ్చుకున్నాను.నాకోడలు కూడా జాబ్ చేస్తున్నది.నామనవడు రుద్వేద్ నాప్రాణం.వాడి పేరు నా ఎడం చేతి పై పచ్చపొడిపించుకున్నాను.రెండో బాబు హోటల్ మేనేజ్మెంట్ చేసి తన వృత్తి లో స్థిరపడ్డాడు.మా అత్త గారు మామగారిని కూడా నేనే చూసుకుంటాను.జీవితంలో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా నిలబడాలి అని నా అభిప్రాయం.ఇక డిస్ట్రిబ్యూటర్లు వచ్చి మందులు ఇచ్చి వెల్తారు.అనుభవం ఉంటే మెడికల్ షాపు నిర్వహణ కష్టం కాదు.25శాతం లాభం ఉంటుంది.డిస్కౌంట్ ఇస్తాం.ఉదయం9.30_2దాకా సాయంత్రం 5.30_10దాకా నేను షాపులో కూర్చుని చూసుకుంటాను , మాపెద్దబాబు నాకు చేదోడు వాదోడుగా ఉంటాడు.” అని చెబుతూ మహిళలకు స్ఫూర్తి దాయకం గా మాట్లాడిన రాజకళగారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తరుణి తరుఫున చెప్పి సెలవు తీసుకున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నోములు — వ్రతాలు

చిన్నారి తల్లి