కంచి పట్టుచీర

కవిత

కాంచీపురంలో కళ్ళు విప్పి

లోకమంతా చుట్టబెట్టి

చూపులన్నిటినీ ఆకర్షించే సూదంటురాయి

కళాకారుడి నైపుణ్యానికి గీటురాయి

ఇంద్రధనుస్సును ఇలకు దింపి

శుభకార్యాన్ని శోభాన్వితం చేసే

సాంప్రదాయిక వైభవ చిహ్నం

పట్టుదారం జరీపోగు పెనవేసుకుని

వర్ణ సోయగాలను కొంగున ముడేసుకుని

మగువ మనసు దోచే వస్త్ర విశేషం

స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో రూపుదాల్చి

బంగారు జరీతో విభిన్నతను పొంది

నిగనిగలాడే మెరుపు మృదుత్వంతో

వస్త్ర ప్రపంచాన సుస్థిరతను సొంతం చేసుకొని

పద్మశ్రీ చెన్నోజ్వల

అనుక్షణం ఆధునికత సంతరించుకొని

ముగ్ధ మందారాన్ని మురిపించే చీర సింగారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సినిమా పాటలో సాహిత్యం

నోములు — వ్రతాలు