ప్రేమ ఎంత మధుర

కథ

       తాటికోల పద్మావతి

తూర్పు తెలతెలవారబోతున్నది. మసక చీకట్లు ముసుగు తొలగించుకొని వేకువ రాకముందే పారిపోయాయి. రాత్రి విచ్చుకున్న మల్లెలు ఇంకా పరిమళాలను దాచుకున్నాయి. ఎర్రటి మందారం మొగ్గలు సూర్యకిరణాలు వస్తేనే గాని విచ్చుకోనంటూ మొరాయిస్తున్నాయి. గుడిలో నందివర్ధనం పూలు తెల్లగా స్వచ్ఛమైన మనసుని చాటుతూ భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి.
బయట నిలబడితే ఎవరైనా చూస్తారని గుడిలో లోపల గాలిగోపురం పక్కగా నిలబడింది మంజరి. తన చూపులన్నీ వచ్చేవారికోసం గాలిస్తున్నాయి.
‘మనోహర్ వస్తాడా’, ఏదో అనుమానం!
తప్పకుండా వస్తాడు. నాకోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు. నేను ప్రేమించకపోయినా నన్ను తనే ప్రేమించాడు. అటువంటి నిష్కల్మషమైన ప్రేమను కాదనుకొని నా జీవితాన్ని చీకట్లోకి నెట్టేసుకున్నాను. మనోహర్ తన ప్రేమ ఎంత నిజాయితీదో నిరూపించుకున్నాడు!
తన ఆలోచనలకి అంతరాయం కలిగించినట్లు పదేళ్ల కుర్రాడు వచ్చి అక్క మీ పేరు మంచిరియైన అన్నాడు.
అవును! ఏం కావాలంది.
అన్నా నీకీ చీటీ ఇవ్వమన్నాడంటూ ఒక పేపరు మంజరి చేతిలో పెట్టి తుర్రున వెళ్లిపోయాడు.
పేపర్ విప్పి చూసింది మంజరి!
అంతే ఒక్కసారిగా గుండె లయ తప్పింది. గబగబా బయటికి వచ్చి వచ్చినదారినే బస్టాండ్ కి చేరి బస్సు ఎక్కి విజయవాడలో దిగి హాస్పిటల్ కి చేరుకుంది.
రిసెప్షన్ లో వివరాలడికి రూమ్ నెంబర్ 12 లోకి వెళ్ళింది. మంచం మీద స్పృహ లేకుండా పడుకొని ఉన్న మనోహర్ని ఆ స్థితిలో చూసేసరికి దుఃఖం ఆగలేదు మంజరికి.
తలకి కట్టు కట్టారు. లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకిలా జరిగింది!
తనని రక్షించి తాను ప్రమాదంలో పడ్డాడు. ఇదంతా ఎవరి పని. ఇంకెవరుంటారు ఆ దుర్మార్గుడు ప్రదీప్ ఇదంతా చేసి ఉంటాడు. నమ్మకద్రోహి ఇంత నీచనికి ఒడిగడతాడని కలలో కూడా ఊహించలేదు. నన్ను దక్కించుకోవాలని మనోహర్ మీద పగబట్టాడు.
నర్సు వచ్చి మనోహర్ తలకి కట్టు మార్చింది. మనోహర్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మంజరి కనిపించింది.
‘పైకి లేవబోయాడు’
వద్దని వారిస్తూ అతన్ని లేవకుండా పడుకోబెట్టింది.
ఈ దెబ్బలన్నీ నా మూలంగానే తగిలాయి కదా! పెద్ద రిస్క్ తీసుకున్నావు. నీ ప్రాణాలకే ముప్పు వచ్చింది. నీకేమన్నా అయితే మీ వాళ్ళు ఎంతగా బాధపడతారో తెలుసా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
‘నాకేమీ కాలేదు లే! ఈ దెబ్బలు నాలుగు రోజుల్లో తగ్గిపోతాయి. ఈ విషయం ఇంకా మా ఇంట్లో ఎవరికీ తెలియలేదు. నువ్వు మాత్రం ఆ చీకటి ప్రపంచంలో నుంచి బయట పడ్డావు అంతే చాలు.
మంజరి! నువ్వు రాత్రి నుంచి ఏమీ తినట్లేదు. వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా తిను. ఇదిగో నా ఏటీఎం కార్డు అంటూ పరుపు కింద నుంచి కార్డు తీసి మంజరి చేతికి అందించాడు.
తన చేతిలో రూపాయి లేదు. ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చింది. రాత్రంతా ఏమీ తినలేదు. నీరసంగా అనిపించింది.
బాత్రూం కి వెళ్లి ఫ్రెష్ అప్ అయి వచ్చి క్యాంటీన్ కి వెళ్ళింది. టిఫిన్ చేసి వేడివేడి కాఫీ తాగితే గాని కాస్త రిలీఫ్ గా అనిపించలేదు. వస్తూ వస్తూ మనోహర్ కి కూడా ఇడ్లీ కట్టించుకుని తెచ్చింది.
మంజరి ఇడ్లీ తినిపిస్తుంటే ప్రేమగా ఆమె చేయి పట్టుకుని, నువ్వు ఈరోజు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళు. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక మీ వాళ్ళతో మాట్లాడి మన పెళ్లి విషయం చెప్తాను అన్నాడు.
“మన పెళ్లా? ఆశ్చర్యంగా అడిగింది మంజరి.
“ఇంత జరిగాక కూడా ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా! పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? నేనిప్పుడు పూజకు పనికిరాని పువ్వుని. ఆ పాపాత్ముడు నన్ను మలినం చేశాడు.ఈ పాపిష్టి దాన్ని స్వీకరిస్తావా అంటూ బోరున ఏడ్చింది.
మైల పడింది నీ శరీరమే గాని నీ మనసు కాదుగా! అది ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుందని నాకు తెలుసు.ఈ పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళగలను. నువ్వు పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉంటానంది.
‘వేలకు మందులు ఇస్తూ కంటికి రెప్పలా చూస్తున్నది మనోహర్ని. వెన్నెముకకి బలమైన దెబ్బలు తగలడంతో లేచి తిరగటం కాస్త కష్టమన్నారు డాక్టర్లు. పూర్తిగా నయం కావడానికి నెలలు పట్టొచ్చు, లేదా సంవత్సరమైనా పట్టొచ్చు. ఇంటికి వెళ్లి మందులు వాడుకోవచ్చు అన్నారు.
మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుందన్నట్లు భగవంతుడు ఇలా చేశాడు. నిన్ను పెళ్లి చేసుకొని సుఖ పెట్టాలనుకున్నాను. నాలాంటి వాడిని చేసుకొని నువ్వేం సుఖపడగలవు. మన జీవితాలు ఇలా రాసిపెట్టి ఉంటే మనమేం చేస్తాం. ఇప్పటికైనా మించి పోయింది లేదు. నువ్వు మీ వాళ్ళ ఇంటికి వెళ్లి నా మాట విని నీకు నచ్చిన పెళ్లి చేసుకోవచ్చు.
మనోహర్ మాటలకు మంజరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
నిన్ను ఈ స్థితిలో వదిలేసి నన్ను వెళ్లిపొమ్మంటున్నావా. నువ్వు కూడా నన్ను వదిలేసి ఊరుకోలేకపోయావా?
నాకు నువ్వంటే ప్రేమ అందుకే నిన్ను కాపాడాను.
‘ఒకప్పుడు నాకు నీ మీద ప్రేమ లేని మాట నిజమే! నువ్వు నా చుట్టూ తిరిగావు. నేను నా కలల ప్రపంచంలో వివరించాలని నీ ప్రేమని నీ మనసుని దూరం చేసుకున్నాను. నా అందానికి తగిన ఏ రాకుమారుడు రావాలని కలలు కన్నాను. జీవితమంటే రంగుల ప్రపంచం అనే,అందని వాటికోసం అర్రులు చాచి బలవంతంగా నైనా వాటిని దక్కించుకోవాలని ఆశపడ్డాను. అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు చాలా బాధగా ఉంది.
“, అవన్నీ పీడకల్లా మరచిపో!
“ప్రదీప్ నా జీవితానికి పట్టిన చీడపురుగు. ప్రేమించినట్టు నటించాడు. నన్ను నాశనం చేసింది గాక ధన దాహంతో నన్ను ఒక వ్యాపారపు బొమ్మను చేసి ఆడుకోవాలని చూశాడు. టీవీలో సీరియల్స్ లో నటించే అవకాశం ఇప్పిస్తానని మభ్యపెట్టాడు. షూటింగ్ పేరుతో నన్ను పరాయి వాళ్లకు తాకట్టు పెట్టాలని చూసాడు. వాళ్లు నిజంగానే నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించారు. చెప్పినట్టు చేయకపోతే చంపేస్తానని బెదిరించారు. చివరికి ప్రదీప్ కూడా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే బొంబాయికి అమ్మేస్తానన్నాడు. ఆ సమయంలో ఏదో అదృష్ట శక్తిలా నువ్వు రాబట్టి సరిపోయింది. లేకపోతే నా జీవితం పాప పంకిలం అయిపోయేది. ఆ మురికి కోపం నుంచి బయటపడేసిన నిజమైన ప్రేమికుడివి నువ్వే.
“మన పెళ్లి మాట అటు నుంచి నువ్వు మామూలు మనిషివి అయ్యేదాకా నేను నిన్ను కాపాడుకుంటాను. అది నా బాధ్యత. కాదనకు!
మీ ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తుంటారు నా మాట విను.
“ఇంతకుముందు నేనంటే మా వాళ్ళకి ఎంతో గౌరవం. ఇప్పుడు నా దుస్థితి చూసి నన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు. ప్రేమా పెళ్లి అంటూ తప్పటడుగు వేసిన దాన్ని. నా ముఖం మీదనే తలుపులు వేస్తారు. ఆ అవమానం నేను భరించలేను. ఆత్మహత్య చేసుకోవాలి. నేను అలా చేసుకోవడం నీకు ఇష్టమేనా చెప్పు!
అసలు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకు రాకుండా ఉన్నా బాగుండేది. ఆఫీస్ కి దాన్ని బ్రతికింది ఏం చేయాలి?
“అందుకే అంటారు ప్రేమ గుడ్డిదని. నేను నిజంగానే గుడ్డిదాన్ని. నా జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నాను. నిజం తెలిసాక కూడా నీకు దూరంగా ఎలా ఉండగలను.
‘ఇప్పుడు మనకి కావలసింది ప్రేమ పెళ్లి కాదు. నువ్వు మోసపోయావు. నేను గాయపడ్డాను. ఇప్పుడు మనిద్దరికీ ఓదార్పు కావాలి. ధైర్యంగా బతకాలనుకుంటే ఒకరికొకరం తోడు కావాలి అంతకుమించి ఏమీ కోరుకోకూడదు.
“మంజరి కళ్ళు తుడుచుకొని అలాగే నీ ఇష్టం అంది.
‘ఇంతలో సరళ అక్కడికి రావడం ఇద్దరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది.
“మనోహర్ దగ్గరికి వచ్చి ఎలా ఉంది ఆరోగ్యం.అనవసరంగా నిన్ను పంపించి ప్రమాదానికి గురి చేశానా! మంజరిని కాపాడాలని నీ ప్రాణాలకే ముప్పుతెచ్చుకున్నావు. నన్ను క్షమిస్తావు కదూ అంది.
‘సొంత అన్న కన్నా నన్ను నమ్మవు కాబట్టే మంజరి ప్రమాదంలో ఇరుక్కుందంటే వెళ్లకుండా ఎలా ఉంటాను. నువ్వు చాలా మంచి పని చేశావు.ఈ పోరాటంలో నా ప్రాణాలు పోయినా లెక్కచేసి ఉండేవాడిని కాను.నేను వెళ్లడం ఇంకా సాలస్యం అయితే మంజరిని ఆ నలుగురు షూటింగ్ పేరుతో పాడుచేసి ఆమెని బొంబాయికి తీసుకెళ్లి పోయేవారు. నీ సమాచారాన్ని అందుకొని పోలీసులను వెంటబెట్టుకుని వెళ్లాను కాబట్టి సరిపోయింది. వాళ్లు ముందుగా నా మీద అటాక్ చేస్తారని ఊహించలేకపోయాను.పోలీసులు పట్టుకునే సమయంలో ఆ రౌడీలు నా మీద దాడి చేశారు.
“ఎలాగైతే నేం. ఒక ఆడపిల్లని రక్షించావు.నీ ప్రేమని కాదని నిన్ను తిరస్కరించిన మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మంజరిని కాపాడావు. నీ ప్రేమ ఎంత గొప్పదో! వేరే చెప్పాలా.
ఇష్టం లేకపోయినా ప్రేమించమంటూ వెంటపడతారు కొంతమంది. ప్రేమించడం లేదని ఒంటరిగా వస్తుంటే దారి కాచి యాసిడ్లు పోసి తగలబెడుతున్నారు. ప్రేమించడం లేదని పగ పెంచుకొని గ్యాంగ్ ను వెంటనే రేప్ చేసి ఆ తర్వాత హత్య చేసి ఆత్మహత్యగా సృష్టిస్తున్నారు. ప్రేమించకపోతే చంపేస్తారా! అమ్మాయిలకు అదే నా శిక్ష!, ప్రేమ అనేది మనసులో నుంచి పుట్టుకొని రావాలి.
బలవంత పెడితే ప్రేమ పుట్టుకొస్తుందా! మా అన్న ప్రదీప్ కి జైలు శిక్ష పడిన నాకు బాధ లేదు. మనవాడే కదా అని వదిలేస్తే ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తాడో! వాడికి సరైన శిక్ష పడి తీరాల్సిందే.
చెల్లెలు వైనా అన్న దుర్మార్గుడని మరో ఆడపిల్లని కాపాడావు. నిజంగా నువ్వు నీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే?
మంజరి కూడా నాలాంటి ఆడపిల్ల!
తనకి జరిగిన అన్యాయం నాకు జరిగితే ఎవరైనా ఇలాగే చేస్తారు. నా స్నేహితురాలిని నమ్మించి మోసం చేసిన అన్న అయినా సరే శిక్షకు గురికావాల్సిందే ఆవేశంగా సరళ మాట లు నిజమే అనిపించాయి.
“మీరిద్దరూ ఎప్పటికైనా ఒకటి కావాల్సిందే! అప్పుడే మంజరి జీవితానికి ఒక అర్థం పరమార్థం.
చూసావుగా సరే ఏమంటున్నాడో అంటూ మంజరిని ఇప్పటికైనా నీ అభిప్రాయం మార్చుకోవా అన్నాడు.
“ప్రేమ ఎంత మధురమైందో ఇప్పుడే తెలుసుకున్నాను”నిజంగా ప్రేమించిన నీ మనసుని వదులుకోలేను. నాలాంటి దాన్ని నువ్వు స్వీకరిస్తానంటే కాదనటం నిజంగా నేను దురదృష్టవంతురాలిని. మనస్ఫూర్తిగా నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తాను. నావల్ల తగిలిన ఈ గాయాలను మళ్లీ నా ప్రేమతోనే మాన్పిస్తాను.
“సరళ ఇద్దరినీ పిలిచి చేతిలో చేయి వేయించింది. ఒక పాపిష్టి వాడి చేతిలో మోసపోయిన మంజరి నిజంగా కలువ పువ్వు లాంటిది. కమలం బురదలో ఉన్న బురద కమలానికి అంటదు.
వాళ్ళిద్దరినీ కలిపి వీడ్కోలు తీసుకుంది.
“ఎవరు ఏమనుకుంటారోనని కూడా ఆలోచించలేదు. మనోహర్ మంజరికి కొత్త జీవితాన్ని అందించాడు. ప్రేమను ప్రేమించాలి కానీ పగ, ద్వేషం పెంచుకోకూడదు. అప్పుడే నిజమైన ప్రేమకు నిర్వచనం.
ప్రేమను ప్రేమించిన నాడే నిజమైన ప్రేమకు అర్థం. ప్రేమ ఎంత మధురం ఆ మాధుర్యం ఆస్వాదిస్తేనే గాని ప్రేమ మాధుర్యం తెలుసుకోలేరు.
మనోహర్ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాడు. మంజరి సహచరియంతో పూర్తిగా కోల్కొన్నాడు. దేవుడి సమక్షంలో ఇద్దరూ ఒకటయ్యారు.”,
నిజమైన ప్రేమ విలువ తెలుసుకున్న మంజరి కలల ప్రపంచంలో విహరించడం లో తన తప్పు తెలుసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన జెండా వందనం

సినిమా పాటలో సాహిత్యం