పదనిసల సరాగాలు

తరుణి ముఖచిత్రం

చిత్రకారిణి- భవ్య విక్రమ్, బెంగళూర్.

స్వాంతం మొత్తం
సాంత్వన కోరినట్టు
అమ్మ రెక్కలు
ఇంత విశాలత్వాన్ని
ఇంత వర్ణ మయ నాగరికత ఇస్తాయనుకోని
పసిపాప కోరుకోని
పదనిసల సరాగాలు
ప్రవాళాలు వెదజల్లినట్టు
శరజ్యోత్స్నలు మబ్బులు మబ్బులయి ఉదయానుభూతులు
పంచుతూ
సాయం సమయాలు
ఆకాశమంతా పరుచుకున్నప్పుడు
అప్పుడు
అమ్మ నవ్వులు
అదేపనిగా ఎగరేస్తున్నప్పుడు
గువ్వల సవ్వళ్ళలా
గుండె ఝుమ్మంది
కమ్మని ప్రేమమయమైపోయే
కన్నతల్లి స్పర్షలా
ఆ అనంతాకాశం సాక్షీభూతంగా నిలిచినప్పుడు
అందనంత దూరంలో తూనీగ ల్లా
ఆలోచనలు ఎగరేసిన జేండాలయిన భావాలేవో మనసును పరవశింపచేయవూ!

చిత్ర కవిత రచన- డాక్టర్ కొండపల్లి నీహారిణి
తరుణి సంపాదకురాలు

 

                        

Participated in Hastag Kalakar Art contest 2023 where there were 83000+ participants and this competition has 2 levels for 1st level the Art unit will select top 500 and for next level 50%public votes and 50% Judges votes where I secured 22nd rank and one of my submitted painting got featured in Hastag kalakar Moonsoon Edition 2023
– Sri Bhavya Vikram Dhoolipala

Written by Bhavya dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మా అమ్మ

నీయెంటే నేనుంటా