నాలో- నేను

కవిత

         రంగరాజు పద్మజ

స్త్రీ వాదంచేయడమే లేదు!
కాదు పక్షపాత ధోరణి!
అంతకన్నా బంధుత్వమేమీ లేదు!
అయ్యయ్యో! బాలల ఆక్రందన వినని చెవులా నావి?ఆమె బాధే నావాదం !

నా కవితలో సింహ మధ్యమలుండరు!
మల్లెలు తురిమిన బారు జడలు ఉండవు!
మంత్రముగ్ధుల చేసే మహా సౌందర్యాలుండవు!
ఉండేవన్నీ పీడిత- తాడిత; బాధ తప్త హృదయాలు

అంతులేని చరిత్రలు!
తీసుకొని విరగదీసుకొని పని చేసే చేతులు
ప్రేమ- త్యాగం- తనరక్తంతో నడిపే కుటుంబం
ఆలంబనగా బ్రతికే ఆడ జీవాలు!

కన్నీటితో తడిసి ముద్దైన అక్షరాలు!
మునిపంటితో నొక్కిన మనసు నొప్పులు!
పిడికిట బంధించిన పరువు ప్రతిష్టలు!
చీకట్లో మగ్గుతున్న ఆడపిల్లల అంతరంగాలు !

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తెలుగు భాష విశేషాలు

అమ్మ ..!!