పూలవనం

తరుణి ముఖచిత్రం

మనసు పూల వనం
మధుర స్వప్న సుందరం
ఆలోకనమంతా ఆలోచనల అందాలే

నీవు నేనను భేదం లేదని
హృదయం ప్రఫుల్లమై
వాగ్ధానాల వెల్లవ
మీదైనా జ్ఞాన చక్షువులలో
కొత్త అర్థం చెప్పినప్పుడు
బింబప్రతిబింబ భావనా సంపత్తికి
ఓ అనిర్వచనీయ ప్రేమ రస రమ్యతగా నిన్నల్లుకుంటుంది
ఈ పందిరిపై పచ్చని కాపురం
రంగుల బొమ్మను చేసేస్తు నిన్నో ఉన్నత శిఖరాల సంసార సంపదల పరంపరలో
నిలుపుతుంది
చేయాల్సిందల్లా
నేను నీవను
అతి గొప్ప లేని
అతి పీడన లేని
నడక నడత నవతరంగం కావాలి
అత్యంత అభ్యుదయమైపోయి
అనంతమైన ఆప్యాయమైపోయి
కలసిన మనసులు కలకాలం నిలిచిపోయే కమనీయత మీరైతే
అవునూ మీరే అయితే
నీవు అతనూ
నీవూ ఆమె
అనుబంధాల పరిమళమే !
నిజాయితీ సుగంధం
ఈ జగానికి జాగృతి!
ఈ పూలవనం నిండా పిండారబోసిన వెన్నెల లే
ఉషః కాంతుల స్వర్ణ పుష్పాలే!!

చిత్రకారిణి – దరిపెల్లి శ్రియ
Shreeya Daripalli
చిత్ర కవిత రచన – డాక్టర్ కొండపల్లి నీహారిణి

Written by Darpalli Sriya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

ఏదైనా సాధించాలనుకుంటే ఒక నిబద్ధత్తత, క్రమశిక్షణ తప్పనిసరి