దేవుడే గెలిచాడు

సినీ సమీక్ష

          లక్ష్మీమదన్

నేను దాదాపు 35 ఏళ్ల క్రితం చూసిన సినిమా అనుకుంటా, ఆ సినిమా పేరే “దేవుడే గెలిచాడు” ఆ సినిమా చూసిన తర్వాత నేను చాలా రోజులు ఒక్కదాన్ని పగలుపూట ఉండడానికి కూడా భయపడ్డాను ..అంటే ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ సినిమా ఎలాంటిది అని అదేనండి దయ్యాల సినిమా!

ఈ సినిమా మాతృక మలయాళం నుండి తీసుకున్నారు.. విజయనిర్మల గారు ఈ సినిమా తీయాలి అనుకున్నప్పుడు అందరూ వద్దని చెప్పారట… ఎందుకంటే ఇలాంటివి తెలుగులో ఆడవు అని అన్నారట.. కానీ కృష్ణ గారి ప్రోత్సాహం వల్ల విజయ నిర్మల గారు దర్శకత్వం వహించి ఈ సినిమా తీశారట ఆమెకిది నాలుగవ సినిమా. అందులో హీరోగా కృష్ణ ఇద్దరు హీరోయిన్స్ గా వెన్నిరాడై నిర్మల గారు విజయనిర్మల గారు.. అంజలీదేవి గారు కూడా ఇందులో నటించారు జగ్గయ్య గారు హీరోయిన్ కి అన్నగా నటించారు.

ఇక సినిమా విషయానికి వస్తే అద్భుతంగా ఉంది సినిమా.. ఆ రోజుల్లో గ్రాఫిక్స్ ఎక్కువగా లేని సమయంలో దయ్యాన్ని ఒక నీడలా చూపించడం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనకు నిజంగా భయం కలిగించేలా చిత్రీకరించడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం .

కృష్ణ గారు అంటే హీరో మొదట ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు … ఇద్దరూ అన్యోన్యంగా ప్రేమించుకుంటారు హీరో వాళ్ళ ఊరికి వెళ్లి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఊరికి వెళ్తాడు ఆ సమయంలో ఇక్కడ ఈమెకి దగ్గర బంధువైన ఒక అతను ఈ అమ్మాయిని బలాత్కారం చేయపోతే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది అక్కడే ఆమె ఆత్మగా తిరుగుతూ ఉంటుంది తను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది అని తెలుసుకున్న హీరో కృష్ణ చాలా బాధపడి తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆమె విజయనిర్మల …వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు… ఒకసారి ఆఫీస్ పని మీద హీరో మొదటి హీరోయిన్ తో ప్రేమలో పడ్డ ఊరికి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు హీరోయిన్ కూడా అంటే అతని భార్య తనతో వెళ్తుంది … తర్వాత వారిద్దరూ కలిసి చక్కని ప్రదేశాలలో విహరిస్తారు అప్పుడు మొదటిగా ప్రేమించిన అమ్మాయి ఆత్మ వీళ్లను చూస్తుంది వీరిని అనుకరించి వీరు బస చేసిన గెస్ట్ హౌస్కి వస్తుంది హీరోయిన్ కి మాత్రమే ఆ ఆత్మ లీలగా కనిపించడం వస్తువులన్నీ కదలడం ఇలాంటివన్నీ చాలా బాగా చూపించారు థియేటర్లో చూస్తున్నంత సేపు భయం కలుగుతుంది ఆ తర్వాత ఈ అమ్మాయి నాకు భయంగా ఉంది అని హీరోకి చెప్తుంది “మువ్వలు సవ్వడి వెంటాడుతున్నట్టు నీడ కదిలి వస్తున్నట్లు”
ఇలా జరుగుతుంది అని చెప్తుంది దానిని అతను పెద్దగా పట్టించుకోకుండా నవ్వి “మనం మన ఊరికి వెళ్ళిపోదామని” ప్రయాణం కడతారు ఆత్మ వీరిని అనుసరిస్తూ వీరి వెంట ఇంటికి చేరుతుంది ఇంకా చాలా చాలా భయపెడుతూ చివరికి హీరోయిన్ లో చేరిపోతుంది ఆ ఆత్మ..

తెల్లవారి నిద్రలేచిన దగ్గర నుండి ఈ అమ్మాయి నడవడిక విచిత్రంగా మారిపోతుంది సాంప్రదాయంగా ఉన్న అమ్మాయి ముందు అమ్మాయిలా డ్రెస్సింగ్ స్టైల్ మరియు అలంకరణ చేసుకుంటుంది, హీరో కూడా ఆశ్చర్యపోతాడు హీరోయిన్ అన్న మాత్రం ఈ విషయాన్ని పసిగడతాడు వారిద్దరి మధ్య పంతం పెరుగుతుంది “చంపేస్తాను” అని అంటాడు ఆమె అన్నయ్య అప్పుడు” నీ చెల్లెలే చని” అని ఆత్మ చెబుతుంది ఇలా అయిన తర్వాత కొన్ని రోజులకి ఈ అమ్మాయి ముందు వీళ్ళు వెళ్లిన ఊరికే వెళదామని అడుగుతుంది అంటే అది ఆ ఆత్మ సొంత ఊరు ..సరే అని అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి తన ఇంటికి వెళ్తుంది అక్కడ ఏడుస్తూ ఉన్న వాళ్ళ అమ్మని చూసి “అమ్మా” అని పిలుస్తుంది
” ఎవరమ్మా నువ్వు” అని ఆమె అడుగుతుంది

అప్పుడు” నేను నీ కూతుర్ని” అని చెప్తుంది

” నువ్వు నా కూతురు ఏంటి నా కూతురు చనిపోయి నాలుగు సంవత్సరాలు అయింది” అని చెప్తుంది

” లేదమ్మా నేను నీ కూతురిని” అని చెప్పి ఇల్లంతా తిరుగుతుంది తన గదిలోకి వెళ్తుంది అక్కడ తను రహస్య ప్రదేశంలో దాచిన ఒక వస్తువును ఆనవాలుగా చూపిస్తుంది. అప్పుడు ఆ తల్లి ఈమెను తన కూతురుగా నమ్మి దగ్గరికి తీసుకొని ఏడుస్తుంది ఏమి జరిగిందో వివరంగా చెప్తుంది ఆత్మగా తను ఈ శరీరంలోకి వెళ్లానని చెప్తుంది అప్పుడు తల్లి చెప్తుంది “తప్పు నువ్వు వేరే వారి జీవితం నాశనం చేయకూడదు వెళ్లిపో” అని చెప్తుంది ఆత్మ అంటుంది “నేను వెళ్ళను నేను కోరుకున్న వాడితోనే ఉంటాను” అని వాదిస్తుంది ఇలా చాలా విషయం నడుస్తుంది కథలో చివరికి ఒక లోయ దగ్గరికి తీసుకెళ్లి హీరోని తోసివేయాలనుకుంటుంది అప్పుడు అతను ఆత్మ అయితే తను అతనితో కలిసి వెళ్ళవచ్చని ఒక ఉపాయం ఆలోచిస్తుంది చివరికి అర్థరాత్రి వేళ ఆ లోయ దగ్గరికి వెళతారు వెళ్లిన తర్వాత అతనిని తోసివేయాలి అనుకున్నప్పుడు ఆమె తల్లి ఒక దేవుడి చిత్ర పటాన్ని తీసుకుని వచ్చి అక్కడ తన కూతురు రూపంలో ఉన్న అమ్మాయికి చూపిస్తుంది … “వెళ్ళిపో వెళ్ళిపో” అని అరుస్తుంది అప్పుడు “నేను నీ కూతుర్ని నన్ను వెళ్ళిపో అనకు అమ్మ” అని ఏడుస్తుంది అప్పుడు ఆ తల్లి “ఇది ధర్మబద్ధం కాదు అమ్మాయి జీవితం నాశనం చెయ్యొద్దు” అని చెప్పి దేవుడి పటాన్ని దగ్గరికి తీసుకెళ్తుంది అప్పుడు ఆ ఆత్మ పైకి వెళ్ళిపోతుంది హీరోయిన్ విజయనిర్మలకి జరిగిన విషయం ఏమీ తెలియదు అలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అడిగితే ఏమీ లేదు అని విషయం తెలియకుండా జాగ్రత్తపడి చిన్న అనారోగ్యం మాత్రమే అని చెప్పి తన ఆరోగ్యం కుదుటపడే వరకు జాగ్రత్తగా చూసుకుంటారు కథ సుఖాంతం అవుతుంది నిజంగా సినిమాలో ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది కానీ ఈ సినిమా ప్రింట్ దొరకడం లేదట.. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారట కానీ విఫల ప్రయత్నమే అయ్యింది నాకు కూడా మరోసారి చూడాలని ఎంతో ఆశగా ఉండేది చివరికి మలయాళంలో చూశాను కానీ తెలుగులోనే బాగా అనిపించింది నాకు… మలయాళం లో హీరోను చంపేసి విషాదం చేశారు.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వ్యాకరణం – జీవన వ్యాపారం

ఎక్కడున్నాయ్  మన జగన్నాధ రధ చక్రాలు ?