వ్యాకరణం – జీవన వ్యాపారం

కొత్తగా ఆలోచించాలి. అప్పుడే జీవితం మాధుర్య భరితం అవుతుంది. ఈ విషయాన్ని కవయిత్రి ,రచయిత్రి ,తెలుగు ఉపాధ్యాయురాలు కామేశ్వరి ఓగిరాల గారు తెలుగు వ్యాకరణం లోని అక్షర మాల నుండి అచ్చులు హల్లులు , వర్గాక్షరాలు, సంధులు సమాసాలు అలంకారాలు ఛందస్సు వంటివి నిత్య జీవితానికి అన్వయం చేస్తూ చక్కగా క్లుప్తంగా రాస్తున్నారు. సీరియల్ గా వచ్చే ఈ విశేషాలను చదివి ఆనందించండి.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి
తరుణి సంపాదకురాలు

వ్యాకరణం నేర్చుకుంటే దోషాలు సవరించుకొని భాషను అవగాహన చేసుకో గలుగుతాం
జీవితంలో ఎంతో మంది మనకు ఎదురవుతూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వభావం. ఎవరు ఎలాంటి వారో, ఎవరితో ఎలా మెలగాలో తెలుసుకుంటే జీవితం లో పైకి వస్తాం.

కామేశ్వరి ఓగిరాల భువనగిరి ఇండియా ఎం.ఏ. తెలుగు (తెలుగు ఉపాధ్యాయురాలు ప్రైవేట్ స్కూల్ ) చరవాణి 8008296355

అసలు వ్యాకరణానికి జీవితానికి పోలికలు ఉన్నాయా? లేవా? సంబంధం ఏమిటి ఎలా అన్వయించుకోవాలి? ఇప్పుడు పరిశీలిద్దాం. క్రితం వారాలలో వర్గాక్షరాలలా మనుషుల లోనూ ఉంటారనీ,వ్ కార, అ కారాలను తోసేసి ‘ఆ‘గా వచ్చే సవర్ణ దీర్ఘసంధి వంటి విషయాల ఉదాహరణ లనూ తెలుసుకున్నాం
కదా ఇప్పుడు మరి కొన్ని తెలుసుకుందాం.
మిత్రులారా! ముందుగా నా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తున్న తరుణి పాఠకులకు ధన్య వాదాలు తెలుపు కుంటూ మరి కొన్ని అంశాలతో మీ ముందుకు వచ్చాను.
జీవితంలో ఒక్కొక్క సారి ఇద్దరు కలిసి ప్రయత్నం చేసారనుకొండి వేరే వాళ్ళు ఆ అవకాశాన్ని ఎగరేసుకు పోతారు. చూడండి ఎట్లాగో
గుణ సంధి: పరమ+ఈశ్వరుడు
అ+ఈ రెండూ కాకుండా ఏ ఆ అవకాశాన్ని చేజిక్కించు కుంటుంది.
కొంత మంది ఎదుటి వాళ్ల స్వభావం తెలుసు కోకుండా మన వాళ్ళే కదా అని చేర దీస్తారు. వాళ్ళు వచ్చిన తరువాత వీళ్ల నెత్తిన చేయి పెడతారు . ఎలాగో చూడండి
త్రిక సంధి: త్రికంబు మీది అసంయుక్త హల్లునకు
ద్విత్వంబు బహుళము గా నగు
ఆ+కన్య. ఆ+క్కన్య
తీరా ద్విత్వం వచ్చిన తరువాత ముందున్న దీర్ఘాన్ని హ్రస్వం గా మారుస్తుంది
కొంత మంది ఉంటారు గోడ మీది పిల్లి వాటం లా …
అయితే కావచ్చు కాక పోతే కాక పోవచ్చు అన్నట్లు . అదెలాగో చూద్దాం….
ఇత్వ సంధి :- ఏమ్యా దు లందలి ఇత్తు నకు సంధి వై కల్పికము
మరి+ఏమి మరి యేమి,. మరేమీ

ఇలా ప్రతి చోట ప్రతి సందర్భంలో మనకు తెలియకుండానే జీవితం లో వ్యాకరణం ముడిపడి ఉంది. మరికొన్ని అంశాలు వచ్చే వారం తెలుసుకుందాం.

Written by Kameshwari Ogirala

పేరు :కామేశ్వరి ఓగిరాల
ఊరు :భువనగిరి
ఇండియా
చదువు :ఎం ఎ తెలుగు
ఉద్యోగం :తెలుగు ఉపాధ్యాయురాలు (ప్రైవేట్ స్కూల్ )
చరవాణి 8008296355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తప్పంతా వారిదేనా…?!

దేవుడే గెలిచాడు