ఓ నిర్భయ కథ
కథ చెబుతాను ఓ కథ చెబుతాను
కథలో ఓ ఆడపిల్ల వ్యధ చెబుతాను
మగువ బ్రతుకు చిత్రంలో ఓ నిర్భయ వేదన
పలికేను నా గలమున ఆ ఆత్మఘోషగా
ఎనిమిదేళ్ల పసిప్రాయపు చిరుకూనర
హిమగిరిలను మురిపించు పూబోనిరా
ఆటలాడు అమాయకపు ఆ చిట్టి తల్లి
మృగాళ్ల పశువాంఛలకే చిధ్రమైన
కోమ లి
ఏ చట్టం చూసినమ్మ నీ శరీర వేదన
ఏ న్యాయం వినే నమ్మ నీ ఆక్రందన
కొవ్వొత్తుల ర్యాలీలను చేపట్టిన
ఆగు నా ఈ సమాజాన మగువరోదన
ఇది మగువ బ్రతుకు చిత్రంలో ఓ నిర్భయవేదన
పలికెను నా గలమున ఆ ఆత్మఘోషగా
కథ
ప్రకృతి అయిన అవనిలోన సారమున్నది
ఆ జీవమే ఈ సృష్టికి మూలమైనది
స్త్రీ జన్మత ఆదిపరాశక్తి రా
కరుణ అనే ముసుగులో చేష్టలుడికి చూసేరా
అమ్మగా తన తనువునిచ్చు
ఆలిగమరుజన్మనిచ్చు
బిడ్డగా తన ప్రేమ పంచు
నేస్తమైసేద తీర్చగా
మహిళా నీకు వందనం
జననీ పుష్పాభివందనం
నా కలమున నాగలమున సాగిన ఈ పాట
అవ్వాలి స్త్రీ ప్రగతికి మరువపుపూ
బాట……,.