పిట్ట కథ

కథ

రాపోలు శ్రీదేవి

ఓ రోజు ఉదయాన్నే కళ్ళు నులుముకుంటూ ఇంటి వెనుకకు వచ్చిన కన్నకు వెనకింటి గోడకు ఉన్న కన్నంలో ఓ అద్భుత దృశ్యం కనబడింది.

ఒక తల్లి పిట్ట తన పిల్లలకి నోటితో ఆహారం అందిస్తున్నది. ఆ దృశ్యాన్ని చూస్తూ అలా ఉండిపోయింది కన్న.
అప్పుడే అమ్మ చెరిగిన బియ్యం నుండి నూకలు నేల మీద రాలి పడితే అవి తల్లి పిట్ట నోటితో తీసుకెళ్లి తమ పిల్లల నోట్లో పెడుతుంటే బాగా అనిపించింది. అంతలోనే ఆ తల్లి పిట్ట ఎటో ఎగిరిపోయింది.

అది గమనించిన కన్న, తన చేతితో నూకలు తీసుకొని ఆ కన్నం లోకి విసిరింది.
ఆ పిల్ల పిట్టలు అవి రాళ్లనుకొని బెదిరి పోయాయి.

ఒక పిట్ట తనకొచ్చీరాని రెక్కలతో గూటి నుంచి ఎగిరి పక్కనే ఉన్న తోటలోని దానిమ్మ చెట్టు మీద వాలింది.

“అయ్యో” అని కన్నా వాళ్ళు, వాళ్ళ వాళ్లతో బుట్టల సాయంతో
ఆ పిల్లపిట్టని గూటికి చేర్చాలని దానిమ్మ కొమ్మను ఊపారు. కానీ ఆ పిల్ల పిట్ట గూటి వైపు వెళ్లకుండా మరో చెట్టుపై వాలింది.
మళ్లీ పిల్ల పిట్టను వెతుకుతూ తోట అంతా తిరగగా మరోచెట్టుపై కనిపించింది.
గూటి వైపు పంపిద్దామని ప్రయత్నించినా కొద్దీ ఆ పిల్ల పిట్ట తనకు వచ్చిరాని రెక్కలనాడిస్తూ ఒక్కో చెట్టుపై వాలుతూ.. చివరకు కనపడకుండా పోయింది .

అందరూ ఆత్రంగా వెతకగా చిక్కుడు తీగ పొదలో కనపడీ కనపడినట్టు కనపడింది .
‘”ఇదిగో ఇక్కడ ఉంది చూడండి”అని
కేకలు వేసి పిలవగానే అందరూ వచ్చి చూసారు. ఏముంది …
పిట్ట తలకాయ పసిరిక పాము నోట్లో కరచుకొని ఉన్నది. అలా ఉండడం చూసి వంకాయలా ఉందేంటి అనుకుంది కన్న! కానీ పసిరిక పాము అని అనుకోలేదు !!అది పాము అని నిర్ధారించుకునేసరికి , పిట్ట అవస్థ చూసి కన్నా కన్నీరు పెట్టుకుంది .

ఆ రోజంతా అదే ఆలోచిస్తూ ఉండిపోయింది .
బడికి వెళ్లినా పంతులు చెప్పే పాఠాలు బుర్రకు ఎక్కడం లేదు. స్నేహితులు చెప్పే ముచ్చట్లు మనసు మరిపించట్లేదు.

ఏ జీవి కి హాని చేయకూడదని మాంసాహారం కూడా తినేది కాదు కన్న.

కొన్నాళ్లకు ఆమె పెళ్లి అయి గర్భవతి అయింది .
కానీ అనారోగ్యం వల్ల గర్భస్రావం చేయించుకోవలసి వచ్చింది.
బహుషా ఆ తల్లి పిట్ట పెట్టిన శాపమో ఏమో అని దుఃఖించింది. దశరధుడు తెలియక చేసిన పొరపాటు వల్ల తల్లిదండ్రుల శాపానికి గురి అయ్యి పుత్రశోకం అనుభవించి మరణించాడు.
అలాగే
ఆ పిట్టశాపంతో తనకు పుత్ర సంతానం పోయింది .
ఇద్దరు అమ్మాయిలు పుట్టినా, పెరిగి మంచి స్థితిలో ఉన్నా గాని ఏదో తెలియని వెలితి.
ఓ నాడు “అమ్మ” అంటూ ఓ ముద్దులొలికే బాబు తన్ని అల్లుకొన్నాడు..
అదేంటో అర్ధం కాలేదు కన్న కు కనులు తెరచి చూసాక తెలిసింది అది కల అని ..తనకు దక్కని బాబు కి పెట్టాలనుకున్న పేరు ను పదే పదే గుర్తుచేసుకుని బాధ పడింది కన్న.
బాబుని కని ఉంటే ఆమె అత్తగారు ఆనందించేది.అనుకుంటూ కన్నీరు పెట్టుకుంది.
అమ్మాయిలను కన్నందుకు అత్తగారికి
కోడలినైన తన పై కోపం..తనకు తర్వాత కాన్పు లో అమ్మాయి పుట్టింది పుట్టిన పసికందును చూడడానికీ కూడా మనసొప్పని అత్త గారు నలుగురు ఏమంటారో నని ఆ పాప ని ఎత్తుకుందేతప్ప ఇష్టం తో కాదు.
అందుకే అబ్బాయి పుడితే బాగుండేది అని బాధ పడేది
అయినా తన పిల్లల ను మగ పిల్లలకు ధీటుగా పెంచినది కన్న.

తన భర్త ఏ గొడవలు లేకున్నా కూడా… ఆమెను పుట్టింటికి పంపేవాడు కాదు.. అలాగే పుట్టింటి వారిని వారి కడప లోనికి కూడా అడిగెయ్యనియ్యడు .

చదువురిత్యా ఉద్యోగరిత్యా కన్నపిల్లలు దూరంగా ఉంటే ..తన కన్న తల్లి ఇంటికి దగ్గరగా ఉన్నా ఏనాడు ఇంటికి వెళ్లి చూడలేదు. ఇంటికి రమ్మనలేదు.
అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం.
బహుషా అది ఆనాడు తెలియక చేసిన పొరపాటు వల్ల ఆ తల్లిపిట్ట కు తాను చేసిన అన్యాయం వలన కావచ్చు…

అందరూ దేవుడు ప్రత్యక్షమైతే ఏవేవో కోరుకుంటారు కానీ… దేవుని ఒకే ఒక కోరిక కోరుకోవాలని అనుకుంటుంది కన్నా అది తన కన్నతల్లిని ఒక మారు తన ఇంటికి పిలిచి స్వహస్తాలతో వండి ప్రేమగా వడ్డించాలని ..
అది తీరేనో లేదో మరీ..
తన కోరిక నెరవేరునో.. కాలమే తెలపాలి మరీ..

పురుషాహంకారం తో
పుట్టింటికి పంపని భర్త లకు ఈ కన్న కన్నీటి కథ తో కనువిప్పు కావాలని…ఆశిస్తూ …

Written by Rapolu Sridevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వరుణుడి వరం

వినుడు వినుడు జనులారా!