విశ్వామిత్రుడు గొప్ప తపస్సంపన్నుడు.ఆ విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు మేనకను పంపిస్తాడు. మేనక చేత ఆకర్షితుడై విశ్వామిత్రుడు తపస్సు నుండి కామకేళిలోనికి మారతాడు.ఫలితంగా మేనక గర్భవతి అవుతుంది. విశ్వామిత్రుడు తపోభంగం జరిగిందని భావించి మేనకను అక్కడి నుండి పంపివేస్తాడు.మేనక ఆడబిడ్డను ప్రసవించి,ఇసుక దిబ్బ మీదవిడిచి వెళ్లిపోతుంది. అలా విడిచిన బిడ్డను పక్షులు తమ రెక్కలతో రక్షిస్తాయి. అపుడు ఆ మార్గంలో వెళుతున్న కణ్వమహర్షి ఆ బిడ్డను చూసి పక్షుల రెక్కలతో రక్షించబడటం వల్ల శకుంతల అని పేరు పెట్టి తన ఆశ్రమంలో పెంచి పెద్ద చేస్తాడు.
దుష్యంతుడు ఒక రోజు జింకను వేటాడుతూ,కణ్వమహర్షి ఆశ్రమము వైపు వస్తాడు. అక్కడ శకుంతలను చూసి మోహితుడై ఆమె పరిచయం అడుగుతాడు.శకుంతల తన తండ్రి చెప్పిన జన్మ వృత్తాంతం చెపుతుంది. అపుడు దుష్యంతుడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని గర్భదానం చేస్తాడు. తన రాజ్యానికి వెళ్ళిన దుష్యంతుడు ఎంతకూ రాడు.శకుంతల గర్భవతి అన్నవిషయం కణ్వమహర్షికి తెలుస్తుంది. కణ్వమహర్షి దివ్యదృష్టితో జరిగినది తెలుసుకొని శకుంతల భరతుడుని ప్రసవించాక ఆమెకు తోడుగా కొందరు ఋషులను తోడిచ్చి,హస్తినాపురానికి దుష్యంతుని వద్దకు భరతునితో సహా పంపిస్తాడు. వచ్చిన శకుంతలను వచ్చేదారిలో శకుంతల నదిలోని నీటిని తన చేతితో కదుపుతున్న సమయంలో తన వేలికి ఉన్న అంగుళీయకము జారినది. దానిని వెంటనే ఒక చేప మ్రింగుతుంది. ఆ విషయాన్ని శకుంతల గుర్తించక అంగుళీయకాన్ని చూపించపోతే అది తన వేలున కనిపించలేదు. ఇంతలో ఒక జాలరి పెద్దచేపతో రాజదర్బారులో అడుగుపెట్టెను. ఆ చేపను కోయగానే దాని ఉదరమున రాజ అంగుళీయకము బయటపడుతుంది. ఆ అంగుళీయ కాన్ని చూడగానే దుష్యంత మహారాజుకు శకుంతల గుర్తుకొస్తుంది. అంతలో ఆకాశవాణి పలికిన మాటల ద్వారా దుర్వాశ మహాముని శాపకారణంగా అని గ్రహించి, జరిగిన వృత్తాంతం గుర్తుకు తెచ్చుకుని, శకుంతలను తన భార్యగాను, భరతుని తన కుమారునిగాను అంగీకరిస్తాడు. ఈ భరతుని పేరు మీద మన భారతదేశానికి భారతదేశం అని పేరువచ్చింది.