తరుణీ తరుణం లో ఈసారి మనం ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ రాసిన దేవదాసు నవలలోని పార్వతి గురించి చెప్పుకుందాము. ఈ నవల ౧౯౧౭ లో రాసినది .అంటే 125 సంవత్సరాల క్రితం అన్నమాట . అప్పటి నుంచి ఇప్పటి వరకు పాఠకుల ను , ప్రేక్షకులను ఒకేలా ఆకర్షిస్తూనే ఉంది. ఈ నవల ఇప్పటి వరకు వివిధ భాషల్లో 12 సార్ల సినిమాగా వచ్చింది. దీని ప్రేరణతో వచ్చిన వాటి లెక్కే లేదు.౧౯౨౮ లో నితీష్ చంద్ర మిత్ర తీసిన మూకీ చిత్రం నుండి ఇటీవలి సంజయ్ లీలా బన్సాలి దృశ్య కావ్యము వరకు వచ్చిన సినిమాలే దీని ప్రజాదరణకు తీపి గురుతులు.తెలుగులో పాట దేవదాసు వీటిలో కలికి తురాయి.
౨౦ వ శతాబ్దం నటి తోలి రోజుల్లో బెంగాల్ లోని ప్రజాజీవితం , సామా జిక పరిస్థితులు మనల్ని ఆలోచింపజేస్తాయి.
జాలో , ప్రేమో , అభిమానమో మరేదో దేవదాసుని మనవాడిని చేసింది. మనందరివాడుగా నిలిపింది.
దేవదాసుకు బలము ,బలహీనతా పార్వతే .అది ఆత ను తెలుసుకునేలోగా పరిస్థితులు తారుమారయ్యాయి
ఈ నవల ఆధారంగా పార్వతి మానసిక ఎదుగుదలను తెలిపే చిరు ప్రయత్నమే ఈ శరత్ చెక్కిన శిల్పాలు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవదాసు – పార్వతి -చంద్రముఖి అనే మూడు ముఖ్య పాత్రలతో శరత్ అల్లిన ముప్పేట జడ కుచ్చులవాలుజడ దేవదాసు
Vijayakandala