
అన్యాయం నా శత్రువు
అణచటం నా ఆశయం
ఆత్మస్థైర్యం నా ఆయుధం
ఆడపిల్లను నేను.
అబలనని యోచించకు
అంచనా మార్చుకో
పిడుగునై కాల్చేస్తా
మరణ శాసనం రాసేస్తా
ఆడపిల్లను నేను
అమ్మ కడుపు చల్లగా
హాయిగా బ్రతకరా
కామాంధుడవై నీకుగా
కన్ను పొడుచుకోకురా
ఆడపిల్లను నేను
అన్నగా మసలితే
చల్లని చెల్లినవుతా
కామంతో తాకితే
అపరకాళికనవుతా
ఆడ పిల్లను నేను