వినుడు వినుడు జనులారా!

పల్లవి::
వినుడు వినుడు జనులారా!
తెలుగు ప్రజలారా!
అందమైన తెలుగు భాష
మన జాతి సంపద.
సైనికులై రక్షించుట
మన అందరి బాధ్యత.
“వినుడు”

చరణం::
ఎందరెందరో కవుల వరముగా
విలసిల్లినదీ మన తెలుగు.
విద్యా భారతి హృదయ గీతిగా
వినిపించినదీ మన తెలుగు.
“వినుడు”

చరణం::
అమ్మానాన్నల అపురూప ప్రేమగా
వెలుగొందినదీ మన తెలుగు
వెల వెల బాటును దరిచేరనీయనీ
రక్షణ కవచమె మన చదువు.
“వినుడు”

చరణం:::
ఒడిలో పాపగ ఎదిగెడి వేళ
లాలి పాటగా రవళించినదీ తెలుగు
ఆడిపాడెడి పిల్లల మదిలో
కాంతి రేఖగా వెలుగొందాలీ మన తెలుగు.
“వినుడు”
చరణం::
నీతి నిజాయితి విలువను తెలిపే
నిర్మల సాహితి మన తెలుగు.
మనిషి మనిషిని మనీషిగ చేసే
మకరంద మాలిక మన తెలుగు.
“వినుడు”

చరణం::
బాలలందరికి తెలుగు నేర్పెను
సిలికానాంధ్ర అమెరికనందు
తెలుగు నేలపై తెలుగు వెలుగుకై
కృషి చేయాలి మనము.
“వినుడు”

Written by Tripurari Padma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అడోల్సీన్స్ ఫేస్

పిట్ట కథ