చదువు కునే కాలం వెళ్లి పోయింది
చదువు కొనే కాలం వచ్చింది
కె. జి. నుండి పి. జి. కే
లక్షల్లో ఫీజ్ లు
లక్ష్యం లేని చదువులు
జీవిత విలువలు బోధించలేక
సిలబస్ తో కుస్తీ పట్టలేక
గురువంటే భయభక్తులు లేని
విద్యార్థులను మార్చలేక
తక్కువ మార్కులు వస్తే
తల్లిదండ్రులకు ఎదురుపడలేక
యాజమాన్యానికి సమాధానం చెప్పలేక
గురువు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క
అరవై శాతం మార్కులు అత్యధికమప్పుడు
దశ దిశ మారి
నూరు శాతం మార్కులిప్పుడు
హాజరు ఉంటే చాలని
పై తరగతులకు తోసేస్తుంటే
తమ ఆశను పరువును నిలబెట్టమంటూ
కన్న వారు కన్నీరు కారుస్తుంటే
ఒక యంత్రం లా చదివి ర్యాంకులు సాధించాలంటూ యాజమాన్యం ఒత్తిడి చేస్తుంటే
చదువుల బాలుడు
బోధనల గురువూ త్రాసులలో కొలతలు
అందరికి విద్య ఇదేదో బాగుందని
అధికారులు ఊదరకొడుతుంటే
చదువు రుద్ది
బాల్య మధురానుభూతులను దూరం చేసి
బండెడు పుస్తకాలను వీపున మోసిన విద్యార్థి
తన గమ్యమేదో తనకే తెలియని అయోమయం లో పడుతుంటే
తాను అనుకున్నది సాధించలేక
కన్న వారి ఆశలు తీర్చలేక
దారి తప్పిన గమ్యం వెంటఁ పయనించలేక
జీవితం అంటే గెలుపొక్కటే
ఓటమి అంటే మరణమే అనే భావన బలపడుతుంటే
ఆత్మ హత్య లకు విద్యార్థులు పాల్పడుతుంటే
బాధ్యులు ఎవరు
ఒకేసారి ఆలోచించండి