జ్ఞాన నిధి

గురు పూర్ణిమ సందర్భంగా

కామేశ్వరి వాడ్రేవు

భూమి మీద జన్మ తీసుకున్నప్పటినుంచి పాఠాలు నేర్చుకోవలసినదే. చిన్న జీవి మొదలు మనిషి దాకా మనుగడ సాగడానికి మార్గదర్శి చాలా అవసరం. వాళ్ళ నే మనం గురువు అంటాం. అందులో ఆది గురువు తల్లి. నెలల పిల్లలతో మూగ భాషలో మాట్లాడగలదు. తర్వాత వయసు పెరిగే కొద్దీ బిడ్డకునడక,నడత నేర్పి ఒక స్థాయికి తీర్చిదిద్దుతుంది. తర్వాత తండ్రి భయభక్తులు నేర్పుతాడు. జీవితానికి ఒక సూత్రధారి అవుతాడు.
తరువాత మార్గదర్శి విద్య నేర్పే గురువు. విద్యాధనాన్ని యిస్తాడు. శిష్యుడికి ఒక స్థాయి, ఒక హోదా కల్పిస్తాడు. నిజానికి ఆలోచిస్తే పుట్టినప్పటినుంచి చరమ దశ వరకు ఏదో ఒకటి నేర్చుకోవలసిన అగత్యం ఏర్పడుతుంది. కొన్ని చూడటం ద్వారా, కొన్ని వినటం ద్వారా, కొన్ని అవగాహన చేసుకోవడం ద్వారా, పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాం. ఎలా నేర్చుకున్న అదంతా గురువు యొక్క ప్రాబల్యమే. ప్రకృతి మనకు ఒక అజ్ఞాత గురువు. శీతోష్ణస్థితులు తట్టుకోవటం, కావలసిన ఏర్పాట్లు చేసుకోవడం, తిండిబట్ట ఏర్పరచు కోవటం మొదలైన పాఠాలు నేర్చుకోవడానికి అవకాశంకలిగిస్తోంది. పశుపక్షాదుల నుండి మానవుల వరకు మౌనంగా నేర్పుతోనే ఉంది. ఎండ వస్తే గొడుగు కావాలి కదా. దాని తయారు చేసే గురువు ఒకడున్నాడు మనకు. అన్ని అవసరాలు తీర్చే గురువులు ఎంతోమంది ఉన్నారు. మనం గుర్తించనిఅజ్ఞాత గురువులు.
మన హిందూ పురాణాల ప్రకారం గురువుల 13 విధాలుగా మనకు సహాయం చేస్తారు.1 వేద గురువులు2 నిషిద్ధ గురువులు 3 కామ్య గురువులు 4 బోధ గురువులు 5 నాద గురువులు 6 ఛాయానిధి గురువులు ( గుప్త గురువులు )7 క్రౌంచ గురువులు 8 పరమ గురువులు9 చందన గురువులు 10వాచక గురువులు 11 కారణ గురువులు 12 సద్గురువులు 13 నిజగురువులు. శిష్యుడు యొక్క సామర్ధ్యాన్ని బట్టి పై గురువులు శిక్షణ ఇస్తారు. ఇది గురుశిష్య పరంపరతో వచ్చేది. ఇప్పుడు మనకు కూడా అంతే కదా లెక్కల్ మాస్టర్ వేరు, సైన్స్ వేస్టార్ వేరు, వైద్య విద్య బోధించేవారు వేరు, ఇంజనీరింగ్ విద్యను నేర్పేవారు వేరు ఇలా రకరకాలుగా ఉన్నారు కదా.
మన హిందూ సంప్రదాయంలో గురువుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. గురు బోధించేది విద్య. విద్యఅంటే పొట్టకూటికి కోసం కాదు. మన నడక,నడత కుదుర్చుకునేది. మన సంస్కృతి సాంప్రదాయాలలో ” గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ ” అని గురువు కి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. వేదవ్యాసులని, వశిష్ఠులని, పురుషులని గురువుగా భావించారు. ఇప్పటి సాంప్రదాయాలు అన్ని వారు చూపిన మార్గంలోనే మనుగడ సాగిస్తున్నాయి. వ్యాసుడిని,వశిష్టుల్ని, సప్త ఋషులని గురువులు గా భావించేవారు. శిష్యుడు ఎప్పుడూ గురువుకి అణుకువ గా ఉండలి .అందుకే క్లాస్ రూమ్ లో మనం టీచర్ రాగానే నుంచుంటాం,నమస్కరిస్తాం. పూర్వకాలంలో పల్లెటూర్లలో పాఠశాల ఉపాధ్యాయుడిని ఊరు పెద్దగా గౌరవించేవారు. ఇంటి పురోహితుడిని కూడా గురువుగా భావించేవారు. ఇలా మన పెద్దల నుండి” గురు పౌర్ణమి ” జరుపు కోవటం మొదలైంది.
ఆధునిక కాలంలో విద్యా విధానంలో మార్పులు వచ్చి గురుశిష్యుల సంబంధం అంత చెప్పుకో తగ్గదిగా లేదు. కానీ ఏ విద్య నేర్చుకోవాలన్న ఒక గురువు కావాలి కదా. గురువులు ఎంతమంది ఉన్నా, ఎన్ని బోధించి నా శిష్యుడుగా తను పొందిన జ్ఞానమే పాఠం. అడుగడుగునా నేర్చుకోవలసిన జ్ఞానం ఎంతో ఉంది. మనము నిత్య విద్యార్థులమే గురు ఎవరైతే నేమి. ప్రతి మనిషికి జీవితం ఒక గురువు. అనుభవాలే పాఠాలు. ఆ పాటలే ముందు తరానికి గురువులు.
* గురువును అనుసరిద్దాం బ్రతుకు బాటను సరిదిద్దుకుందాం *

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పరిచయం

ఎర్రరంగు బురుద