స్వప్నం

కథ

సుమలత దేశ్పాండే

అది నిండు పౌర్ణమి రాత్రి… ఆరు బయట మంచంపై పడుకున్న..పంకజానికి… మబ్బుల మాటున.. దోబూచు లాడుతూ… చల్లని వెన్నెల వెదజల్లుతున్న…
చందమామ కానీ… కొబ్బరి చెట్టు ఆకుల సందుల్లోంచి… తళుక్కున మెరిసే.. తారలు కానీ..కనిపించడం లేదు…

తనకు రోజు వచ్చే.. ఆ భయంకరమైన స్వప్నం గురించే… ఆలోచిస్తుంది…ప్రతి రోజు..అర్ద రాత్రి ఒంటిగంటకి …భయంతో.. ఒక్కసారిగా… ఉలిక్కిపడి లేచే.. తన కల.. గురించి…గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ… లేచి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లో… నీళ్ళు తాగి కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది…

మరుసటి రోజు రాత్రి కూడా అదే కల వచ్చి.. మళ్లీ లేచి కూర్చుంది.. ఆమెకు… రోజూ ఈ కలలు రావడం… ప్రారంభమయ్యాయి…

ఏదో.. పోగొట్టుకున్నట్టు పరధ్యానంగా… ఉంటున్న పంకజాన్ని..చూస్తూ.. ఏమైందని అడిగాడు.. భర్త పరంధామం…

ప్రతిరోజు వచ్చే.. తన స్వప్నం.. గురించి.. భయపడుతూ…  భాధపడుతూ… పూసగుచ్చినట్టుగా…
చెప్పింది…పంకజం…

అతనికి..ఆమె అవస్థ… చూడలేక… హృదయం.. భాధతో.. విల, విల లాడింది… చివరకు ఒకరోజు ఆమెను… ఆ పట్టణంలోని… ప్రముఖ.. సైకియాట్రిస్ట్..వద్దకు తీసుకెళ్లి సమస్యను.. పరిష్కరించాలని.. నిర్ణయించుకున్నాడు…

మరునాడు…. అపాయిట్మెంట్ తీసుకొని… భార్యను వెంటపెట్టుకుని..మానసిక.. వైద్యుడి వద్దకు.. వెళ్లాడు..

డాక్టర్ గారు.. నా అరవై కేజీల బంగారం.. ఈ ఇరవై రోజుల్లో… యాభై కేజీలు.. అయింది… అర్ద రాత్రి.. ఉలిక్కి పడి లేస్తుంది….వొళ్ళంతా..ఒణికి పోతుంది…ఏదో.. పీడ కల వచ్చింది.. అంటుంది…
ఒక కల ఇంతలా… భయపెడుతుందా????
అసలు ఏం అంతుచిక్కకుండా… ఉంది.. ఎలాగైనా… నా భార్యను..
మీరే కాపాడాలి… అని కన్నీళ్ల.. పర్యంతం అయిన.. పరంధామాన్ని…
జాలిగా చూస్తూ….

మీ కల గురించి వివరంగా చెప్పండి… అన్నాడు..డాక్టర్…
పంకజాన్ని.. చూస్తూ…

” నిగనిగలాడే గుండుతో… ఒకతను.. ఊరికే రావు… ఊరికే రావు… ఫోటో తీసుకో… నాలుగు చోట్ల.. చూపించు…
మా వద్దకు రా…మా వద్దకు రా అంటూ ప్రతి రోజు.. పిలుస్తున్నాడండి… నాకు చాలా.. భయంగా.. ఉంది…
ఆ కల.. కాసేపైనా.. మర్చిపోదామని…టీవీ ఆంచేస్తే… ప్రతి ఛానల్లో… అతనే కన్పించి… ఇంకా.. భయమేస్తోంది… ఇదంతా.. నాకు భ్రమ.. అని సరిపెట్టుకుందామన్నా… సాధ్యం కాకుండా ఉంది అంటూ… కన్నీళ్లు పెట్టుకుంది…
పంకజం…

సమస్య ఏంటో.. ఇట్టే.. అర్ధం అయిన… డాక్టర్.. “చూడండి సర్ “మీ భార్యకు…
“రోజు కలలో.. కనిపించేది…మరేంటో కాదు…
” అది ప్రముఖ గోల్డ్ షాప్ అడ్వర్టైజ్మెంట్ !
మీరు వెంటనే.. తల తాకట్టు పెట్టి…అయినా.. సరే… ఆ షాప్కీ తీసికెళ్లి… మీ భార్యకు.. బంగారు నగలు కొని పెట్టండి…
అప్పుడే… ఇలాంటి కలలు.. రాకుండా.. ఉంటాయి… వీలైనంత త్వరగా.. వెళ్ళండి…”

అన్న డాక్టర్ గారి మాటలకి… అవాక్కయిన పరంధామం…. “కలలు”ఊరికే రావు..అనుకుని… తెల్లమొఖం వేసాడు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మనోవిలాసం

లలిత గీతా బాల శశిబాల