ప్రకృతి కాంత

తరుణి ముఖచిత్రం

చిత్రకారిణి-R. భాగ్య ,వట్టెం మహబూబ్నగర్ జిల్లా. తెలుగు టీచర్, డి.పి.ఎస్ .హైదరాబాద్.

కొండలు, కోనలు
నిండైన సంద్రమూ
గుండె తెరపై తారాడే చిత్రం
కనులకు కలలకు నిండైన రూపం
కొలనులో తామరలు
తామరలతో లలన
అలా అలల నవ్వుల్లో ఓ పువ్వుగా
ఒకనాటి కథలో
కన్నె సౌదామిని
ఈనాటి బొమ్మలో
గిరిజన సౌగంధిక
ఆకాశం సాక్షిగా
నేల దిగిన తటిల్లత
నదీమతల్లి వరపుత్రిక
ఇక కవిత పొంగి పారదా
ఇలా కవి కోకిల కూయదా!

చిత్ర కవిత రచన – డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక సంపాదకురాలు

Written by R Bhagyalaxmi

One Comment

Leave a Reply
  1. చిత్రం అంటే బొమ్మ. బొమ్మ అంటే … కన్నె సౌదామిని…అయినా కావచ్చు…. గిరిజన సౌగంధిక… అయినా కావచ్చు.

    సౌదామిని…సౌగంధిక…పదాలు ……. ఈ చిత్రవ్యాఖ్యాన కవితలో చ ఒప్పిదమైన పాండిత్యపరమైన ప్రామాణిక పదప్రయోగాలు.

    ఎడిటర్ డాక్టర్ కొండపల్లి నీహారిణి మేడమ్ గారు … అసాధారణ పండితులైన … ఒద్దిరాజు సోదరుల రచనలను గురించి సాధికారత గల పరిశోధన చేసిన పరిశోధకులు.

    అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చిత్రం లో విచిత్రం

శ్రీ బాల ప్రహ్లాద పరిపాలన కథనము