ప్రేమ మందిరం
బృందావనం
మధురాతిమధుర
వేణుగానం
చైతన్యమేమో చంగలింత
వన్యప్రాణుల మానవ సమూహాల
నికుంజ నిరంజన
ఓ మోహనాకార ఇక
చలువరాతి లో
చిద్విలాస
తలపై పింఛమెత్తినా
హృదయానందానికి
మురళీ రవాల
గానలోలా
శూన్యమంతా ముఖవర్చస్సై
మా మనో ముకురం పై
చెరగని ముద్రవవుతావా?
చిత్ర కవిత – డాక్టర్ కొండపల్లి నీహారిణి
తరుణి సంపాదకురాలు